- ఐదేళ్ల క్రితం మృతి చెందిన భర్త
విధాత బ్యూరో, కరీంనగర్: రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన కరీంనగర్-వేములవాడ వెళ్లే బైపాస్ రోడ్డు సమీపంలోచోటు చేసుకుంది. మానేరు పాఠశాల చౌరస్తా వద్ద రెడీ మిక్స్ వాహనం ఢీకొనడంతో ఎం రజిత అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
కరీంనగర్ లోని అలకాపురి కాలనీలో నివాసం ఉంటున్న రజిత కుమారుడిని పాఠశాలలో దింపి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని మోడల్ పాఠశాలలో ఈమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. స్వగ్రామం శంకరపట్నం మండలం గద్ద పాక. రజిత భర్త ఐదు సంవత్సరాల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.