Hyderabad | పదో తరగతి( Tenth Class ) చదువుతున్న ఓ విద్యార్థి( Student )తో ఉపాధ్యాయురాలు( Teacher ) అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చందానగర్( Chanda nagar ) పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చందానగర్‌లో నివాసముంటున్న ఓ టీచర్(26) స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో( Private School ) పని చేస్తోంది. అదే పాఠశాలలో గచ్చిబౌలి( Gachibowli )కి చెందిన ఓ విద్యార్థి(15) పదో తరగతి చదువుతున్నాడు. అయితే టీచర్ ఫిబ్రవరి 16న స్కూల్‌కు వెళ్లిన టీచర్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తాత చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు రోజుల తర్వాత టీచర్ ఇంటికి తిరిగి రావడంతో.. ఆమె తాత కేసు విత్ డ్రా చేసుకున్నాడు. ఇదే సమయంలో విద్యార్థి అదృశ్యమైనట్లు గచ్చిబౌలిలో కూడా కేసు నమోదైంది. ఆ విద్యార్థి కూడా రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఎక్కడికి వెళ్లావని విద్యార్థిని పోలీసులు ప్రశ్నించగా, టీచర్‌తో కలిసి వెళ్లినట్లు చెప్పాడు.
టీచర్, విద్యార్థికి పోలీసులు కౌన్సెలింగ్..
ఈ క్రమంలో టీచర్, విద్యార్థిని పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే టీచర్, స్టూడెంట్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టీచర్‌కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. తాను ఇష్టపడ్డ విద్యార్థితో టీచర్ వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.