విధాత: ఓ టీచ‌ర్ లిఫ్ట్ ఎక్కుతుండ‌గా డోర్లు ఆక‌స్మాత్తుగా మూసుకుపోయాయి. అదే వేగంతో లిఫ్ట్ కింద‌కు వెళ్లిపోయింది. దీంతో టీచ‌ర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ముంబైలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్లో శుక్ర‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. టీచ‌ర్ జెనెల్ ఫెర్నాండెస్‌(26) ఆరో ఫ్లోర్‌లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో త‌న‌ క్లాస్ ముగించుకుంది. ఆ త‌ర్వాత‌ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్ […]

విధాత: ఓ టీచ‌ర్ లిఫ్ట్ ఎక్కుతుండ‌గా డోర్లు ఆక‌స్మాత్తుగా మూసుకుపోయాయి. అదే వేగంతో లిఫ్ట్ కింద‌కు వెళ్లిపోయింది. దీంతో టీచ‌ర్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ముంబైలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్లో శుక్ర‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. టీచ‌ర్ జెనెల్ ఫెర్నాండెస్‌(26) ఆరో ఫ్లోర్‌లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో త‌న‌ క్లాస్ ముగించుకుంది. ఆ త‌ర్వాత‌ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. లిఫ్ట్ ఎక్కుతుండ‌గా దాని డోర్లు ఆక‌స్మాత్తుగా మూసుకుపోవ‌డంతో వాటి మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ కింద‌కు వెళ్లిపోవ‌డంతో తీవ్ర గాయాల‌పాలైంది.

అప్ర‌మ‌త్త‌మైన స్కూల్ సిబ్బంది ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తోటి టీచ‌ర్లు, విద్యార్థులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృతురాలి నివాసంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On 18 Sep 2022 7:51 AM GMT
subbareddy

subbareddy

Next Story