Teacher Transfers | విధాత : ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2నుంచి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం విద్యాశాఖ నేడో రేపో షెడ్యూల్ ప్రకటించనుందని సమాచారం. ఉపాధ్యాయ బదిలీల వివాదంపై మధ్యంతర ఉత్తర్వును హైకోర్టు సవరించి ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లను నిరాకరించి, స్పౌజ్ కోటాలో దంపతులకు అదనపు పాయింట్లను కేటాయించి బదిలీల ప్రక్రియకు అనుమతించింది. […]

Teacher Transfers |
విధాత : ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2నుంచి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం విద్యాశాఖ నేడో రేపో షెడ్యూల్ ప్రకటించనుందని సమాచారం.
ఉపాధ్యాయ బదిలీల వివాదంపై మధ్యంతర ఉత్తర్వును హైకోర్టు సవరించి ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లను నిరాకరించి, స్పౌజ్ కోటాలో దంపతులకు అదనపు పాయింట్లను కేటాయించి బదిలీల ప్రక్రియకు అనుమతించింది.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి బదిలీల ప్రక్రియకు సిద్ధమవుతుండటం ఉపాధ్యాయుల్లో హర్షాతీరేకాలు నింపుతుంది. రాష్ట్రంలో 70వేల మంది ఉపాధ్యాయులు గతంలోనే బదిలీలకు దరఖాస్తులు చేసుకోగా ఈ సంఖ్య ప్రస్తుతం మరింత పెరుగనుందని భావిస్తున్నారు.
