విధాత: ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, ప్రమోషన్ల కు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నది. కౌన్సిలింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. OPS అక్కడ సాధ్యమైంది.. ఇక్కడ ఎందుకు కాదు? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,266 మంది టీచర్లు ప్రమోషన్లు పొందనున్నారు. ఫిబ్రవరి 10నాటికి ప్రమోషన్లు, బదిలీలు పూర్తి అయ్యేలా […]

విధాత: ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు, ప్రమోషన్ల కు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నది. కౌన్సిలింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

OPS అక్కడ సాధ్యమైంది.. ఇక్కడ ఎందుకు కాదు?

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,266 మంది టీచర్లు ప్రమోషన్లు పొందనున్నారు. ఫిబ్రవరి 10నాటికి ప్రమోషన్లు, బదిలీలు పూర్తి అయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

ముందుగా హెడ్ మాస్టర్ ల బదిలీలు చేపడుతామని.. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు బదిలీలు , పదోన్నతులు చేసినా, విద్యా సంవత్సరం ముగిసిన తరవాత ఏప్రిల్ లో రిలీవింగ్ చేస్తారు.

Updated On 16 Jan 2023 2:23 AM GMT
krs

krs

Next Story