విధాత: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు