విధాత: టీమిండియా క్రికెటర్లతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖరీదైన కార్ కలెక్షన్లలో ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌కు చెందిన నజీర్ ఖాన్ ఇంట్లో టీమిండియా క్రికెటర్లను జూనియర్ కలిశారు.
నజీర్ఖాన్కు భారతజట్టులోని పలువురు ఆటగాళ్లు స్నేహితులు. నజీర్ ఇంట్లో ఒక ఫంక్షన్‌కు ఆటగాళ్లు హాజరయ్యారు. అదే ఫంక్షన్‌కు ఎన్టీఆర్ వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోనినాటు నాటు పాటలో డ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు ఆ పాటకు రీల్స్ చేశారు.
నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంపై యంగ్ టైగర్‌కు సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యజ్వేందర్ చాహల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ తదితర ఆటగాళ్లు జూనియర్‌తో కలిసి దిగిన ఫొటోలను వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనే యూజర్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.