దేశంలోని కోర్టుల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు పెండింగ్ కేసుల్లో తెలంగాణ‌ 3వ స్థానం ఇక న్యాయ సంర‌క్ష‌కులెవ‌రు? 144038 పెండింగ్ కేసుల‌తో 3వ స్థానంలో తెలంగాణ‌ మొద‌టి రెండు స్థానాలు వ‌రుస‌గా అల‌హాబాద్, రాజ‌స్థాన్‌ సుప్రీంకోర్టులోనే 71వేలకు పైగా పెండింగ్ కేసులు విధాత‌: న్యాయాన్నికాపాడాల్సిన ప్ర‌భుత్వాలే అతిక్ర‌మ‌ణ‌లకు, కోర్టు ధిక్కర‌ణ‌ల‌కు పాల్ప‌డితే న్యాయానికి దిక్కెవ‌రు? న్యాయం అందించాల్సిన కోర్టుల్లోనే కేసులు గుట్ట‌లుగా పేరుకుపోతే న్యాయం ఎలా ద‌క్కేది? దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు మొద‌లు దేశంలోని […]

  • దేశంలోని కోర్టుల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు
  • పెండింగ్ కేసుల్లో తెలంగాణ‌ 3వ స్థానం
  • ఇక న్యాయ సంర‌క్ష‌కులెవ‌రు?
  • 144038 పెండింగ్ కేసుల‌తో 3వ స్థానంలో తెలంగాణ‌
  • మొద‌టి రెండు స్థానాలు వ‌రుస‌గా అల‌హాబాద్, రాజ‌స్థాన్‌
  • సుప్రీంకోర్టులోనే 71వేలకు పైగా పెండింగ్ కేసులు

విధాత‌: న్యాయాన్నికాపాడాల్సిన ప్ర‌భుత్వాలే అతిక్ర‌మ‌ణ‌లకు, కోర్టు ధిక్కర‌ణ‌ల‌కు పాల్ప‌డితే న్యాయానికి దిక్కెవ‌రు? న్యాయం అందించాల్సిన కోర్టుల్లోనే కేసులు గుట్ట‌లుగా పేరుకుపోతే న్యాయం ఎలా ద‌క్కేది? దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు మొద‌లు దేశంలోని హై కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరుకుపోతున్నాయి. దీనిలో అనేక ర‌కాల కేసుల‌తో పాటు కోర్డు ధిక్క‌ర‌ణ కేసులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్న తీరు ప‌ట్ల సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులే అనేక మార్లు అందోళ‌న వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలున్నాయి. దీనికి వివిధ కోర్టుల్లో న్యాయ‌మూర్తుల నియామ‌కాలు స‌కాలంలో జ‌ర‌గ‌క పోవ‌టం, ప‌నిభారం పెరిగిపోవ‌టం ప్ర‌ధాన కార‌ణంగా తెలిపారు. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం అందించ‌టం పట్ల ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని న్యాయ‌మూర్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు ముఖ్యంగా… సివిల్‌, లేబ‌ర్‌, ఎల‌క్ష‌న్‌, రిట్ పిటిష‌న్లు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల లిటిగేష‌న్లు, స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్లు, కోర్టు ధిక్క‌ర‌ణ త‌దిత‌రాలున్నాయి. అధికారికంగా.. తెలిపిన ప్ర‌కారం… సుప్రీంకోర్టులోనే 71వేలకు పైగా పెండింగ్ కేసులున్నాయి.

అందులో కోర్టు ధిక్క‌ర‌ణ కేసులుగా… కానిస్టిట్యూష‌న‌ల్ బెంచ్ కేసులు-498; లేబ‌ర్‌-1,667; ఎల‌క్ష‌న్‌- 497; రిట్‌పిటిష‌న్లు- 2,209; ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాలు-2,870; స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్లు- 4,331; కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు-1, 295 చొప్పున కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

అలాగే… దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో కూడా పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న ప‌లు ర‌కాల కేసుల సంఖ్య రాష్ట్రాల వారీగా చూస్తే… అల‌హాబాద్ హైకోర్టులో అత్య‌ధికంగా..3,77, 455 కేసులు, రాజ‌స్థాన్ హైకోర్టులో1,70,132; తెలంగాణ హైకోర్టులో 1,44, 038 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్న‌ది.

దేశంలో కేసుల న్యాయ‌విచార‌ణ ఇలా న‌త్త‌న‌డ‌క‌న‌ సాగుతూ.., పెండింగ్ కేసులు పెరిగిపోతూ ఉంటే.. ఈ కేసుల విచార‌ణ కొన్ని ద‌శాబ్దాలైనా పూర్తికాద‌ని ఒకానొక సంద‌ర్భంలో సుప్రీం ప్రధాన న్యాయ‌మూర్తి ఒక‌రు ఆవేద‌న చెందారు. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా పెండింగ్ కేసుల ప‌రిష్కారం కోసం, స‌త్వ‌ర న్యాయం కోసం ప్ర‌భుత్వాలు క‌ట్టుబ‌డి ప‌నిచేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉన్న‌ది.

అలాగే… ప్ర‌జ‌ల‌కు న్యాయం అందించాల్సిన ప్ర‌భుత్వాల‌పైనే కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించేదే. ప్ర‌భుత్వాలు, పాల‌కులే కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డుతుంటే.. న్యాయాన్ని సంర‌క్షించాల్సింది ఎవ‌ర‌నేది తీవ్ర స‌మ‌స్య‌గా చెప్ప‌వ‌చ్చు.

Updated On 18 Dec 2022 1:46 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story