RTC Bill | గవర్నర్ తెలిసీ తెలియక వివాదం కొనితెచ్చుకున్నారు: సీఎం కేసీఆర్
RTC Bill | ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక బిల్లు ప్రవేశపెట్టే కంటే […]

RTC Bill | ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇక బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు ఆర్టీసీ బిల్లును ఉద్దేశించి కేసీఆర్ సభలో ప్రసంగించారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తెలిసీ తెలియక అనవసరంగా వివాదం కొనితెచ్చుకున్నారు. ఆర్టీసీ పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాల క్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. నేను కూడా రవాణా శాఖ మంత్రిగా పని చేశాను. ఆ రోజుల్లో ఆర్టీసీ రూ. 14 కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ నష్టాన్ని పూడ్చి, వివిధ ప్రక్రియల ద్వారా మరో రూ. 14 కోట్ల ఆదాయం తెచ్చాం.
డీజిల్ ధర పెరగడం ఆర్టీసీకి పెను భారంగా మారింది. ఆర్టీసీలో రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. ఆర్టీసీ పరిస్థితిపై కేబినెట్‌లో 5 గంటలు చర్చించాం. చివరికి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని అనుకున్నాం. ఏ పని చేసినా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. యువ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించి ఆర్టీసీని గాడిలో పెడుతాం. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమంది విమర్శిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరంగా ఆర్టీసీ మరింత అభివృద్ధి చేస్తాం.
బస్ స్టేషన్లను ఆధునీకరిస్తాం. అవసరమైతే మరికొంత భూమి సేకరిస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తాం. ఉద్యోగ భద్రత వస్తుందని వారు కూడా సంతోష పడుతున్నారు. గవర్నర్ గారు పనిలేని పని పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగారు. చివరికి గవర్నర్ గారికి జ్ఞానోదయమై ఆర్టీసీ బిల్లు ఓకే చేసి పంపించారు సంతోషం. ఆర్టీసీ కార్మికుల పక్షాన, నా పక్షాన గవర్నర్ గారికి ధన్యవాదాలు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది.
