విధాత: తెలంగాణ బడ్జెట్‌ను ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది మాత్రం నెల రోజుల ముందే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. అయితే ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండే […]

విధాత: తెలంగాణ బడ్జెట్‌ను ప్రతి ఏడాది మార్చి నెలలో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది మాత్రం నెల రోజుల ముందే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.
అయితే ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టగానే రాష్ట్రానికి వచ్చే నిధులపై అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక వారంలో కసరత్తు పూర్తి చేసి, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగా, ఆ వ్యయం కూడా కలుపుకుంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉంది.
