Saturday, April 1, 2023
More
    HomelatestTelangana Cabinet | కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. ఇండ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం..

    Telangana Cabinet | కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. ఇండ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం..

    Telangana Cabinet | ప్ర‌భుత్వ స్థ‌లాల్లో పేద‌లు నిర్మించుకున్న ఇండ్ల క్ర‌మ‌బద్దీక‌ర‌ణ( House Regulation ) కోసం జీవో 58, 59 కింద స‌కాలంలో కొంద‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోయార‌ని, క‌టాఫ్ డేట్ రిలాక్సేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి విజ్ఞ‌ప్తులు అందాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు( Minister Harish Rao ) తెలిపారు. ఆ విజ్ఞ‌ప్తుల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రోసారి వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.

    జీవో 58 కింద ఇప్ప‌టి వ‌ర‌కు 1,45,668 మందికి ప‌ట్టాలు పంపిణీ చేయ‌డం జ‌రిగింది. జీవో 58 కింద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేద‌ల‌కు ఇండ్ల హ‌క్కులు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. 59 జీవో కింద ఇప్ప‌టి వ‌ర‌కు 42 వేల మంది ల‌బ్ధి పొందిన‌ట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ల‌బ్దిదారుల‌కు మ‌రో నెల రోజుల స‌మ‌యం ఇచ్చి ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

    గ‌త కాంగ్రెస్, టీడీపీ ప్ర‌భుత్వాలు నిరుపేద‌ల ఇండ్ల‌ను జేసీబీలతో కూల‌గొట్టేవార‌ని మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. పేద‌లు భ‌యం నీడ‌లో బ‌తికేలా ప‌రిస్థితులు క‌ల్పించార‌ని తెలిపారు. కానీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమ‌తో.. అలాంటి పేద‌ల‌ను గుండెల‌కు హ‌త్తుకుని వారికి ఇండ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని పేర్కొన్నారు.

    కటాఫ్‌ తేదీ గతంలో 2014లో తేదీ ఉండేది, దాన్ని 2020కి పెంచాం. ఆ లోపు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారందరికీ 58, 59 జీవో కింద వారికి హక్కులు కల్పించి, పేదల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది గత ప్రభుత్వాలు, మా ప్రభుత్వానికి ఉన్న తేడా. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూల్చడంతో పాటు ఉసురుపోసుకునే వారు. పేదల దగ్గర రాజకీయ నాయకులు, గల్లీ లీడర్లు ఇబ్బందులు పెట్టే పరిస్థితులుండేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టాలను వారి ఇండ్లకు వెళ్లి ఉచితంగా ఇస్తున్నాం అని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular