Telangana | విధాత, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా ఈ పథకం అమలవుతున్నది. అయితే ఈ పథకాన్ని […]

Telangana |
విధాత, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా ఈ పథకం అమలవుతున్నది. అయితే ఈ పథకాన్ని పరిశీలించేందకు ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లింది. అక్కడ విజయవంతంగా అమలవుతున్న విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది.
తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఇక్కడ కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై ప్రతి ఏటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనున్నట్లు వెల్లడించింది.
పాఠశాల విద్యార్థులకు అల్పాహారం ఉత్తర్వులు విడుదల చేసిన సందర్భంగా బాలల హక్కుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని విద్యార్థులందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండు కిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ తెలిపారు.
