విధాత: సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా, ఆదర్శంగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శాలిగౌరారం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక […]

విధాత: సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా, ఆదర్శంగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శాలిగౌరారం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అందకుండా అడ్డుకుంటున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతుబంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయన్నారు.

కేసీర్ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ పార్టీ తెలంగాణపై రాజకీయ, ఆర్థిక దాడులు కొనసాగిస్తూ ప్రజాసంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రజలు సంక్షేమ అభివృద్ధి ఫలాల పరిరక్షణకు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ సందర్భంగా శాలిగౌరారంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు మొత్తం 500 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 25 Nov 2022 1:26 PM GMT
krs

krs

Next Story