Telangana | రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల‌తో పాటు, వాటి వ‌ల్ల సంభ‌వించే మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు తెలంగాణ పోలీసు శాఖ తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఉన్న మార్గాల‌పై పోలీసులు దృష్టి సారించారు. అయితే కొత్త‌గా బైక్ కొనే వారు క‌చ్చితంగా రెండు హెల్మెట్లు కొనేలా చూడాల‌నే ఓ ప్ర‌తిపాద‌న‌ను పోలీసు శాఖ సిద్ధం చేస్తోంది. ఈ ప్ర‌తిపాద‌నను త్వ‌ర‌లోనే అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రాష్ట్రంలో గ‌తేడాది చోటు చేసుకున్న ప్ర‌మాదాల్లో 53 శాతం బైక్ ప్ర‌మాదాలే […]

Telangana | రాష్ట్రంలో రోడ్డు ప్ర‌మాదాల‌తో పాటు, వాటి వ‌ల్ల సంభ‌వించే మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు తెలంగాణ పోలీసు శాఖ తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌ర‌ణాల‌ను త‌గ్గించేందుకు ఉన్న మార్గాల‌పై పోలీసులు దృష్టి సారించారు. అయితే కొత్త‌గా బైక్ కొనే వారు క‌చ్చితంగా రెండు హెల్మెట్లు కొనేలా చూడాల‌నే ఓ ప్ర‌తిపాద‌న‌ను పోలీసు శాఖ సిద్ధం చేస్తోంది. ఈ ప్ర‌తిపాద‌నను త్వ‌ర‌లోనే అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

రాష్ట్రంలో గ‌తేడాది చోటు చేసుకున్న ప్ర‌మాదాల్లో 53 శాతం బైక్ ప్ర‌మాదాలే ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. బైక్ న‌డిపే వారే కాకుండా, వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా హెల్మెట్ ధ‌రిస్తే.. దాదాపు మ‌ర‌ణాల‌ను త‌గ్గించొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బైక్ కొనే ప్ర‌తి వాహ‌న‌దారుడు.. త‌ప్ప‌నిస‌రిగా రెండు హెల్మెట్లు కొనే నిబంధ‌న అమ‌లు చేయాల‌ని పోలీసులు భావిస్తున్నారు.

గ‌తేడాది తెలంగాణ‌లో 10,653 బైక్ ప్ర‌మాదాలు

తెలంగాణ‌లో ప్ర‌తి గంట‌కూ ఒక రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. ఒక మ‌ర‌ణం కూడా న‌మోదు అవుతున్న‌ట్లు పోలీసులు తేల్చారు. ఈ ప్ర‌మాదాలు ఎక్కువ‌గా బైక్ రైడ‌ర్ల‌వే. మ‌ర‌ణాలు కూడా వారివే అధికంగా ఉన్నాయి.

గ‌తేడాది తెలంగాణ‌లో మొత్తం 21,619 రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ్గా.. 7559 మంది మ‌ర‌ణించారు. ఈ మొత్తం ప్ర‌మాదాల్లో 10,653 బైక్ ప్ర‌మాదాలు కాగా, 3,977 మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. ఇందులో మూడొంతుల మ‌ర‌ణాల‌కు కార‌ణం.. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డ‌మే అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కాబ‌ట్టి రైడర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా హెల్మెట్ ధ‌రిస్తే చాలా వ‌ర‌కు మ‌ర‌ణాల‌ను త‌గ్గించొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

బైక్ కొనేట‌ప్పుడు రెండు హెల్మెట్లు కూడా వినియోగ‌దారుడు కొనేలా చూడాల‌ని, అవ‌స‌ర‌మైతే దీనికి సంబంధించి రోడ్డు ర‌వాణా నిబంధ‌న‌ల్లో మార్పులు చేయాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే వీటిని ప్ర‌భుత్వానికి పంప‌నున్నారు.

Updated On 6 May 2023 5:37 AM GMT
subbareddy

subbareddy

Next Story