Chandrababu విధాత‌: నాలుగేళ్ల ఎదురుచూపులు… పలు మార్గాల్లో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఢిల్లీ పెద్దల కరుణా కటాక్షాలకు నోచుకున్న చంద్రబాబు అక్కడ ఏమి మాట్లాడారు..? ఏం ఆఫర్లు ఇచ్చి ఉంటారు..? ఆంధ్రాలో ఎలాగూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్న చంద్రబాబు బిజెపి మద్దతు కూడా ఉంటే తప్ప గెలుపు సంగతి అటుంచి, కనీసం ఎదుర్కొనేందుకు అయినా ఆ ధైర్యం వస్తుందని భావించి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, కేశినేని […]

Chandrababu

విధాత‌: నాలుగేళ్ల ఎదురుచూపులు… పలు మార్గాల్లో ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఢిల్లీ పెద్దల కరుణా కటాక్షాలకు నోచుకున్న చంద్రబాబు అక్కడ ఏమి మాట్లాడారు..? ఏం ఆఫర్లు ఇచ్చి ఉంటారు..? ఆంధ్రాలో ఎలాగూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్న చంద్రబాబు బిజెపి మద్దతు కూడా ఉంటే తప్ప గెలుపు సంగతి అటుంచి, కనీసం ఎదుర్కొనేందుకు అయినా ఆ ధైర్యం వస్తుందని భావించి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర తదితరులతో కలిసి అమిత్ షాను కలిశారు.

ఎన్డీయే నుంచి వైదొలిగి, బిజెపి మీద శతకోటి నిందలు వేసి తిరుపతి వచ్చిన అమిత్ షా మీద రాళ్లేసిన ఘట్టాలు, మోడీ వచ్చినపుడు నల్ల బెలూన్లు ఎగరేసిన ఘటనలు, ఆంధ్రకు బిజెపి మోసం చేసింది, మోసాల మోడీ అంటూ చేసిన ధర్మ పోరాట దీక్షలను మరిచి ఇప్పుడు పొత్తులకు వెళ్లిన చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడి ఉండొచ్చు.. ? ఢిల్లీవాళ్లను ఎలా కన్విన్స్ చేసి ఉండొచ్చు … అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు దాదాపుగా పది వరకూ ఎంపీ సీట్స్ ఇస్తాను అని అంతకు రెండో మూడో ఎక్కువే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను అని చెప్పారని తెలుస్తోంది.

గతంలో 2014లో సైతం ఇలాగే బిజెపికి సీట్లు ఇచ్చినట్లు ఇచ్చి కుడి చేత్తో కొందరు టిడిపి వాళ్లకు బీ ఫారాలు ఇచ్చి అక్కడే మళ్ళీ పోటీకి దించిన చరిత్ర ఉండనే ఉన్నది. అది కాకుండా ఇక తెలంగాణలో బిజెపికి ఫుల్ సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టారని అంటున్నారు. అంటే తెలంగాణలో బిజెపితో రహస్యంగానో, బహిరంగంగానో పొత్తు పెట్టుకుని, అక్కడ బిజెపి సభ్యులకు అవసరమైన ఆర్థిక, ఇతర వనరులు సమకూరుస్తూ అండగా ఉండేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా తాను గత నాలుగేళ్లుగా బిజెపికి అన్ని రకాలుగా లోక్ సభలో సహకరిస్తున్నానని, ఇప్పటికే సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజె వెంకటేష్, గరికిపాటి మోహన్ రావు ( వీరంతా రాజ్యసభ సభ్యులు)ను బిజెపిలోకి పంపించానని, తన పట్ల ఇకనైనా సానుకూలంగా ఉండాలని చంద్రబాబు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా చంద్రబాబు అవసరార్థం చుట్టరికం చేస్తారు తప్ప ఆయనకు నైతికత తక్కువ అనే భావనలో ఉన్న అమిత్ షా ఈ భేటీని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. ఇదిలా ఉండగా చంద్రబాబు మోడీని సైతం కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated On 4 Jun 2023 2:48 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story