విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల (Krishna Water) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేటాయించిన కోటాకు మించి కృష్ణా జలాలు అధికంగా వాడారని రెండు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు కృష్ణా బోర్డుకు పరస్పర పిర్యాదులు చేసుకున్నారు.
ఏపీ 66% వాటాకి బదులు 75% జలాలు వినియోగించిందని, తెలంగాణ 36% వాటాకి బదులు 48% వాడారనీ ఒకరిపై ఒకరు ఆరోపణలతో బోర్డులో ఫిర్యాదు చేశారు. వేసవికాలం పెరగనున్న విద్యుత్ నీటి వినియోగం అవసరాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వివాదం మరింత మూదిరే అవకాశం కనిపిస్తుంది.