విధాత: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ ను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సమాయత్తమయ్యారు.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రిజర్వాయర్ నిర్మాణ పనుల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
నిర్మాణాన్ని ఆపాలని 5 గ్రామాల ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చిన్నోనిపల్లి, బోయలగూడెం, చాగదోన, ఇందువాసి, లింగాపురం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.