HCU | హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో దారుణం జ‌రిగింది. విద్యాబుద్ధులు నేర్పి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెస‌రే వికృత చేష్ట‌ల‌కు పాల్పడ్డాడు. నోట్స్ ఇస్తాన‌ని ఓ విద్యార్థినికి మాయ‌మాట‌లు చెప్పి త‌న ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన యువ‌తి ప్రొఫెస‌ర్ దాడి నుంచి త‌ప్పించుకుని, త‌న హాస్ట‌ల్ గ‌దికి చేరుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. థాయిలాండ్‌కు చెందిన ఓ యువ‌తి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో హిందీ డిపార్ట్‌మెంట్‌లో చ‌దువుకుంటోంది. అయితే శుక్ర‌వారం ప్రొఫెస‌ర్ […]

HCU | హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో దారుణం జ‌రిగింది. విద్యాబుద్ధులు నేర్పి, ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెస‌రే వికృత చేష్ట‌ల‌కు పాల్పడ్డాడు. నోట్స్ ఇస్తాన‌ని ఓ విద్యార్థినికి మాయ‌మాట‌లు చెప్పి త‌న ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన యువ‌తి ప్రొఫెస‌ర్ దాడి నుంచి త‌ప్పించుకుని, త‌న హాస్ట‌ల్ గ‌దికి చేరుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. థాయిలాండ్‌కు చెందిన ఓ యువ‌తి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో హిందీ డిపార్ట్‌మెంట్‌లో చ‌దువుకుంటోంది. అయితే శుక్ర‌వారం ప్రొఫెస‌ర్ ర‌విరంజ‌న్ ప్ర‌త్యేక‌మైన నోట్స్ త‌న వ‌ద్ద ఉంద‌ని, త‌న గ‌దికి వ‌స్తే ఇస్తాన‌ని ఆ యువ‌తిని న‌మ్మించాడు. ప్రొఫెస‌ర్ మాట‌ల‌ను న‌మ్మిన యువ‌తి నిన్న రాత్రి ర‌విరంజ‌న్ ఇంటికి వెళ్లగా.. అక్క‌డ ఆమెతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అత్యాచారం చేసేందుకు య‌త్నించ‌డంతో యువ‌తి అప్ర‌మ‌త్త‌మై ర‌విరంజ‌న్‌ను ఎదురించి త‌న హాస్ట‌ల్ గ‌దికి చేరుకుంది.

తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు త‌న ఫ్రెండ్స్ సాయంతో గ‌చ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మాదాపూర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ కే శిల్ప‌వ‌ల్లి మాట్లాడుతూ.. ప్రొఫెస‌ర్ ర‌వి రంజ‌న్‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. విచార‌ణ అనంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

అయితే థాయిలాండ్ విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు య‌త్నించిన ర‌విరంజన్‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల‌కు భ‌ద్ర‌త క‌రువైంద‌ని ఏబీవీపీ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. మొత్తంగా హెచ్‌సీయూలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో పోలీసులు భారీగా మోహ‌రించారు.

Updated On 3 Dec 2022 9:14 AM GMT
subbareddy

subbareddy

Next Story