విధాత: రష్మీ గౌతమ్‌పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుందనే విషయం తెలియంది కాదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ విషయంలో ఆమె ఎప్పుడూ ఫేమస్సే. సుధీర్‌కి, రష్మీకి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని, వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని.. ఇలా ఎప్పుడూ వారిద్దరిపై వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, మా మధ్య ఏం లేదంటూ వాళ్లిద్దరూ ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా.. ఆ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్‌గా ఇదే విషయంపై […]

విధాత: రష్మీ గౌతమ్‌పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుందనే విషయం తెలియంది కాదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ విషయంలో ఆమె ఎప్పుడూ ఫేమస్సే. సుధీర్‌కి, రష్మీకి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని, వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని.. ఇలా ఎప్పుడూ వారిద్దరిపై వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, మా మధ్య ఏం లేదంటూ వాళ్లిద్దరూ ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా.. ఆ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

రీసెంట్‌గా ఇదే విషయంపై రష్మీ ఫైర్ కూడా అయింది. అది మా వ్యక్తిగత విషయం.. మీకెందుకు చెప్పాలి? అంటూ వారిద్దరి మధ్య ఉన్నది ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే రష్మీపై నెటిజన్లు కొందరు నెగిటివ్ కామెంట్స్‌తో విసిగిస్తూనే ఉంటారు.

ఇప్పుడు కొందరు యూట్యూబర్స్.. ఒక హీరో.. రష్మీకి విల్లా గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ కొన్ని వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలపై ఈటీవీలో ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో రష్మీ రియాక్ట్ అయింది. తనకు విల్లా గిఫ్ట్‌గా ఇచ్చిన హీరో ఎవరో చెప్పి.. ఆ యూట్యూబర్స్‌కి గడ్డి పెట్టింది.

ఈ షోలో ఆమె స్పందిస్తూ.. ‘‘ఒక ఆడపిల్లపై ఇలాంటి వార్తలను ఎలా ప్రసారం చేస్తున్నారు. వాళ్లకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఇలాంటివి చూసి బాధ పడతారని ఎందుకు అనుకోవడం లేదు’’ అంటూ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. మళ్లీ.. ‘‘నిజమే నాకు విల్లా ఒక హీరో గిఫ్ట్‌గా ఇచ్చింది నిజమే. ఆ హీరో ఎవరో కాదు.. నేనే. విల్లానే కాదు.. కారు, ఫ్లాట్ వంటి వన్నీ నేనే స్వయంగా సంపాదించుకున్నాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో వాటిని కొనుక్కున్నాను.

పగలు, రాత్రి షూటింగ్స్ చేస్తూ సరిగ్గా నిద్రకూడా పోలేదు ఎప్పుడు. అంత కష్టపడి అన్నీ సమకూర్చుకుంటే.. నాకెవరో ఇచ్చారంటూ.. యూట్యూబ్‌లో వీడియోలు, థంబ్స్‌తో కొందరు పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. అలాంటి వీడియోలను నమ్మవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..’’ అంటూ తనపై లేని పోని వీడియోలను క్రియేట్ చేస్తున్న వారందరికీ రష్మీ కౌంటరిచ్చింది.

Updated On 23 Nov 2022 5:06 AM GMT
krs

krs

Next Story