- కాజీపేటలో విషాద సంఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లాలోని కాజీపేట పట్టణంలో కాజీపేట రైల్వే ఆవరణంలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద పదేళ్ల చోటు అనే బాలున్ని కుక్కలు (Stray Dogs) మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతిచెందిన ఈ విషాద సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది.
కాజీపేట రైల్వే క్వార్టర్స్ చిల్డ్రన్స్ పార్కు దగ్గర బాలుడు ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగాగాయపడ్డాడు. స్థానికంగా కుక్కల స్వైర విహారం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కల బెడదను నుంచి కాజీపేటవాసులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులారా తస్మా జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.
కుటుంబ సభ్యులను పరామర్శించిన చీఫ్ విప్, మేయర్.. రూ.లక్ష నగదు అందజేత
వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుని మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కుడా ఛైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ లు శుక్రవారం సందర్శించి కుటుంబాన్ని పరామర్శించారు.
సంఘటన సమాచారం తెలవగానే హుటాహుటిన ఎంజీఎం హాస్పిటల్ కు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదును ఆ కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
హనుమకొండ జిల్లాలోని కాజీపేట పట్టణంలోనీ కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణ లో గల నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద ఆడుకుంటున్న బాలుడి పై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన లో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతదేహాన్ని పరిశీలించి ఘటనకు గల కారణాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.