Cracker Ban కాలుష్య నియంత్ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం 'శీతాకాల కార్యాచరణ ప్రణాళిక'లో భాగంగా అమలు ఢిల్లీ పర్యావరణశాఖ‌ మంత్రి గోపాల్ రాయ్ వెల్ల‌డి విధాత‌: దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప‌టాకుల అమ్మకాలపై నిషేధం విధించింది. చలికాలంలో కాలుష్య స్థాయి పెరిగిపోతున్న కార‌ణంగా అన్ని రకాల క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ కేజ్రీవాల్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ది. వివిధ కారణాల వల్ల డిసెంబర్ -జనవరిలో గరిష్ఠ‌ స్థాయికి చేరుకునే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ‘శీతాకాల […]

Cracker Ban

  • కాలుష్య నియంత్ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం
  • 'శీతాకాల కార్యాచరణ ప్రణాళిక'లో భాగంగా అమలు
  • ఢిల్లీ పర్యావరణశాఖ‌ మంత్రి గోపాల్ రాయ్ వెల్ల‌డి

విధాత‌: దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప‌టాకుల అమ్మకాలపై నిషేధం విధించింది. చలికాలంలో కాలుష్య స్థాయి పెరిగిపోతున్న కార‌ణంగా అన్ని రకాల క్రాకర్స్‌పై నిషేధం విధిస్తూ కేజ్రీవాల్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ది.

వివిధ కారణాల వల్ల డిసెంబర్ -జనవరిలో గరిష్ఠ‌ స్థాయికి చేరుకునే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీ ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

సోమ‌వారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. “కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీపావళి సందర్భంగా పటాకులను నిషేధించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఢిల్లీలో ఏ రకమైన పటాకుల తయారీ, నిల్వ, అమ్మకం, ఆన్‌లైన్ డెలివరీ, పేల్చడం పూర్తిగా నిషేధించబడింది ” అని వెల్ల‌డించారు.

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) తరపున లైసెన్సులు మంజూరు చేయబోమని సర్క్యులర్ జారీ చేయాలని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పోలీసులకు సూచించినట్టు మంత్రి తెలిపారు. పండుగలు జరుపుకోవడం ముఖ్య‌మే కానీ, పర్యావరణ సంరక్షణ కూడా అంతే ముఖ్య‌మ‌ని, పేర్కొన్నారు. అందుకే రెండేండ్లుగా ఢిల్లీలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఢిల్లీ ప్రజలు తమకు అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.

Updated On 12 Sep 2023 5:48 AM GMT
somu

somu

Next Story