The Elephant Whisperers | భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఆస్కార్‌లో సత్తాచాటింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్‌ను అందుకున్నది. ఈ అవార్డ్ కోసం హౌలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్?, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్ నామినేట్ కాగా.. భారత్ నుంచి ఎంపికైనా ది ఎలిఫెంట్ విస్పరర్స్ విజేతగా నిలిచింది. ఫిల్మ్ మేకర్ గునీత్ మోంగా సంప్రదాయ దుస్తుల్లో వచ్చి అవార్డ్ అందుకున్నారు కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్ మోంగా. ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించారు.
ఇక ఓ అనాథ ఏనుగు పిల్ల కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఓ దక్షిణ భారతదేశ జంట ఇతివృత్తంతో షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ తెరకెక్కింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కి అవార్డు దక్కలేదు.
ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నవాల్‌నీ’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డును గెలుచుకున్నది. ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ చిత్రానికి షానక్ సేన్ దర్శకత్వం వహించాడు. ఢిల్లీలో గాయపడిన పక్షులను కాపాడే ఇద్దరు అన్నదమ్ములు మహ్మద్ సాద్, నదీమ్ షెహజాద్‌ల ఇతివృత్తంతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ తెరకెక్కించారు.
‘The Elephant Whisperers’ wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023