CM KCR | విధాత: మొద‌ట చ‌క్క‌టి స‌మీకృత ప‌రిపాల‌న భ‌వ‌నాన్ని నిర్మింప‌జేసి నా చేతుల మీదుగా ప్రారంభించ‌నిందుకు అంద‌రినీ అభినందిస్తున్నా. దాదాపుగా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా మీకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. 90 నిమిషాల పాటు ప్ర‌సంగించాను. ఇంటికి వెళ్లిన త‌ర్వాత కొంద‌రు కొన్ని విష‌యాలు చెప్ప‌లేదు సార్ అని చెప్పారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత మ‌నంద‌రం క‌లిసి.. స‌మిష్టి కృషితో అద్భుత ఫ‌లితాలు సాధించ‌గ‌లిగాం. అందులో అనుమానం అక్క‌ర్లేదు. ఇవాళ నాలుగు జిల్లాలుగా విభ‌జింప‌బ‌డి […]

CM KCR |

విధాత: మొద‌ట చ‌క్క‌టి స‌మీకృత ప‌రిపాల‌న భ‌వ‌నాన్ని నిర్మింప‌జేసి నా చేతుల మీదుగా ప్రారంభించ‌నిందుకు అంద‌రినీ అభినందిస్తున్నా. దాదాపుగా రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా మీకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. 90 నిమిషాల పాటు ప్ర‌సంగించాను. ఇంటికి వెళ్లిన త‌ర్వాత కొంద‌రు కొన్ని విష‌యాలు చెప్ప‌లేదు సార్ అని చెప్పారు.

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత మ‌నంద‌రం క‌లిసి.. స‌మిష్టి కృషితో అద్భుత ఫ‌లితాలు సాధించ‌గ‌లిగాం. అందులో అనుమానం అక్క‌ర్లేదు. ఇవాళ నాలుగు జిల్లాలుగా విభ‌జింప‌బ‌డి ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కు చేరువైంది. ఆసిఫాబాద్ అడ‌విలాఆంటి ప్రాంతంలో కూడా మెడిక‌ల్ కాలేజీ వ‌చ్చింది. ఏపీలో ఉంటే 50 ఏండ్ల‌కు కూడా ఈ కాలేజీ వ‌చ్చేది కాదు. ప‌వ‌ర్ ప‌ర్ క్యాపిట‌లో నంబ‌ర్ వ‌న్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం ఎన్నో అవార్డులు తీసుకొని మ‌న‌కు గౌర‌వం తెచ్చిపెడుతుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా హ్యుమ‌న్ ఇండెక్స్ డెప‌వ‌ల్‌మెంట్‌లో విద్యుత్ ప‌ర్ క్యాపిట‌, ప‌ర్ క్యాపిట ఆదాయం.. ఈ రెండు మ‌న గురించి తెలియ‌జేస్తాయి. ఈ రెండింటి విష‌యంలో ఎక్క‌డో ఉన్న మ‌నం చాలా పురోగ‌మించం. త‌మిల‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌ను దాటేసి వెళ్లిపోయాం.

మ‌నంద‌రి స‌మిష్టి కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. దీంతో పొంగిపోవ‌ద్దు. చాలా పేద‌రికం ఉంది. ద‌ళిత జాతి, గిరిజ‌న జాతి, వెనుక‌బ‌డి కులాల్లో నిరుపేద‌లు ఉన్నారు. జ‌ర‌గాల్సింది చాలా ఉంది. ఇదే ప‌ట్టుద‌ల‌, కృషితో ముందుకు పోయి మ‌న సోద‌రులుగా ఉన్న ద‌ళిత‌, గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతుల్లో ఉన్న నిరుపేద‌ల‌ను స‌మాన స్థాయికి తీసుకుపోవాలి.

ఎన్నిక‌ల త‌ర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తాం. గ‌తంలో తాగు, క‌రెంట్, సాగునీటి స‌మ‌స్య‌లు ఉండేవి. వీట‌న్నింటిని 9 ఏండ్ల‌లో అధిగ‌మించాం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగుంది కాబ‌ట్టి.. భ‌విష్య‌త్ కోసం పురోగ‌మించాలి. బాగా క‌ష్ట‌ప‌డి పేద‌రికాన్ని త‌రిమేయాలి. దేశానికే త‌ల‌మానికంగా ఉండాలి. పోడు భూముల పంపిణీని బ్ర‌హ్మాండంగా నిర్వ‌హించాలి.

ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. బ్యాంకు ఖాతాలు సేక‌రించాలి. మాన‌వీయ కోణంలో తీసుకొనే కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశౄం. అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశాం. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు మ‌న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని కోరుతున్నారు. తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతుంది. అందుకు మీరే కార‌ణం. మీ అంద‌రికి కూడా

ఇవాళ నిర్మ‌ల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత బ్ర‌హ్మాండంగా నిర్మ‌ల్ క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుకున్నాం . క‌లేక్ట‌ర్‌ను ప్రారంభించాం. నిర్మ‌ల్ జిల్లాలో ఉన్న 396 గ్రామ‌పంచాయ‌తీలకు ప్ర‌త్యేకంగా త‌ల 10 ల‌క్ష‌లు ఇస్తున్నాం. అదే విధంగా నిర్మ‌ల్, ముథోల్, ఖానాపూర్ 25 కోట్లు చొప్పున ప్ర‌క‌టిస్తున్నాం. ఇవి కాకుండా నిర్మ‌ల్ జిల్లాలో 19 మండ‌ల కేంద్రాల‌కు 20 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నాం.

నిర్మ‌ల్ జిల్లా వాసుల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు, ఎస్సెస్సీ ఫ‌లితాల్లో మొత్తం తెలంగాణ‌లో నిర్మ‌ల్ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. నిర్మ‌ల్ జిల్లా టీచ‌ర్ల‌ను, విద్యార్థుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి ఆల‌యాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నాం. అద్భుత ఆల‌యం నిర్మించుకుందాం.

ఒక‌నాడు మారుమూల జిల్లా అడ‌వి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నం. కొత్తగా మూడు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. మ‌న ప్ర‌భుత్వం ప్రారంభించిన‌టువంటి పేద‌ల కోసం నిర్మించే 2 వేల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు శంక‌స్థాపనం చేశాం. పేద‌వాళ్ల‌ను ఆదుకోవాల‌నే ఉద్దేశంతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం.

మాకు ఇంజినీరింగ్ కాలేజీ కావాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. వెనుక‌బ‌డ్డ ప్రాంతంలో రావాల్సి ఉంది కాబ‌ట్టి.. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేద్దాం. ఎక్క‌డ ఏర్పాటు చేయాలో ఆలోచిద్దాం. గ‌తంలో ఆదిలాబాద్ అంటే వ‌ర్షాకాలం వ‌చ్చిదంటే అంటురోగాల‌తో మ‌న‌షులు చ‌నిపోయేవారు. గ‌త నాలుగైదు ఏండ్ల నుంచి ఎక్క‌డా కూడా ఒక మ‌నిషి చావ‌డం లేదు. ప‌రిశుద్ధ‌మైన మంచినీళ్లు మిష‌న్ భ‌గీర‌థ ద్వారా అందుతున్నాయి. ఆ మ‌ర‌ణాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం, అంటురోగాల నుంచి త‌ప్పించుకున్నాం.

నాలుగు మెడిక‌ల్ కాలేజీలు అంటే నాలుగు సూప‌ర్ స్పెషాలిటీలు ఆస్ప‌త్రులు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇంత గొప్ప‌గా జ‌రుగుతున్న అభివృద్ధిని ఇదే విధంగా కొనాస‌గించుకుంటూ.. మ‌న ఐక‌మ‌త్యాన్ని కొన‌సాగించుకుంటూ ముంద‌కు పోదాం. రైతుల‌ను, పేద‌ల‌ను కాపాడుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవి. ఈ మధ్య కాంగ్రెస్‌ నేతలు ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. మళ్లీ పైరవీకారులు రావాలి. వీఆర్వోలు రావాలి. రైతుబంధు ఏ విధంగా వస్తుంది.

హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నయ్‌. రైతు చనిపోయే ఏవిధంగా రైతుబీమా వస్తుంది. ఎవరూ మాట్లాడకుండా, దరఖాస్తు ఇవ్వకుండానే, ఆఫీసులక వెళ్లకుండా ఎనిమిదిరోజుల్లోనే రూ.5లక్షల వారి ఇంటికి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసి.. డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నాం. గతంలో చాలా బాధలుపడేది. బీటీకి, మార్కెట్‌యార్కెట్‌, అంగడికి పోయిది. రోజుల తరబడి పడావ్‌ పడేది.

ఎవరి ఊరిలో వారు అమ్ముకునేలా 7వేల కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొన్న వడ్ల డబ్బులు బ్యాంకుల వేస్తే.. ఖాతాల్లోకి వస్తున్నాయి. ధరణి పోర్టల్‌ తీసి వేస్తే ఇవన్నీ జరుగుతాయా? మరి ధరణి ఉండాలా? లేదా? ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేయమన్నారో వారిని బంగాళాఖాతంలో విసిరేయాలి. ఎవరైతే వీఆర్వోలు, పట్వారీలు, పరేషన్‌ చేయడానికి, భూములు గోల్‌మాల్‌ చేసేందుకు ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారు.

ఇటీవల మహారాష్ట్రకు వెళ్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వడ్లు కొన్న డబ్బులు ఖాతాల్లో వేస్తారా? చచ్చిపోతే బ్యాంకులోకి వస్తాయా? రైతుబంధు సైతం బ్యాంకులకు వస్తదా? అని ఆశ్చర్యపోతున్నారు.
మళ్లీ పాత పరిపాలన, కాంగ్రెస్‌ పరిపాలన చూడలేదా? వీఆర్వోల దోపిడీ, పహనీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేడం చూడలేదా? ఇవాళ రిజిస్ట్రేషన్‌ కావాలంటే 15 నిమిషాల్లో అయిపోతుంది. పట్టా కావాలంటే 10 నిమిషాల్లో అవుతుంది. ధరణి తీసివేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి? ఎన్ని దరఖాస్తులు పెట్టాలి? అందరు నాకు గట్టిగా చెప్పాలి.

ధరణి ఉండాలా? తీసివేయాలా? అనగా.. ఉండాలని అని జనం నినదించారు. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నా. ఈ దుర్మార్గులు 50 సంవత్సరాలు, రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్లు కూడా ఇవ్వలే. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా బిగించి మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎస్సారెస్పీ ఎండిపోకుండా శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల ధాన్యం పండించుకున్నాం.

రాష్ట్రం ఇలాగే ఉండాలంటే మీ అందరి మద్దతు, ఆశీస్సులు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండాలి. మీ మద్దతు
మరింత ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్మ్‌లో ఎన్నికలు పూర్తయ్యాక ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసి రైతుకు ఎక్కువ డబ్బులు వచ్చేలా మార్కెట్‌కు పంపేలా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ తాలూకాకు ఇబ్బడిముబ్బడిగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టి యువకులందరికీ అక్కడే ఉద్యోగాలు దొరికే పరిస్థితులు తెస్తున్నాం.

మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. ఎస్సారెస్సీ ద్వారా వచ్చే స్కీమ్‌ 27-28 ప్యాకేజీని త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. నేను మీకు హామీ ఇస్తున్నా. ఎస్సారెస్సీ ద్వారా నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు నీరు రాబోతున్నది. చెరవులు పండుగ జరుపుకుంటున్నాం.

8వ తేదీన గ్రామాల్లో కోలాహాలంగా, డప్పు చప్పుళ్లు, భాజాభజంత్రీలతో చెరువు కట్టల మీద పండుగ జరుపుకోవాలి. అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదలు, వృద్ధులు, ఒంటిరి మహిళలను ఆదుకుంటున్నాం. దేశంలోనే ఇవాళ తలసరి ఆదాయంలో తలమానికంగా, అగ్రభాగాన తెలంగాణ ఉన్నది.

గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఇవాళ ఎవరూ రైతుల వద్దకు వచ్చి ఎవరైనా ఎన్ని మోటార్లు పెట్టావ్‌? ఎన్ని హెచ్‌పీల మోటార్లు పెట్టావని అడిగేవారే లేరు. రైతులు నిలబడాలని, వ్యవసాయం పండుగ కావాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వు ఉండాలని ఎన్ని హెచ్‌పీల మోటార్లు పెట్టినా సంవత్సరానికి రూ.12వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తుంది. మళ్లీ ఈ దుర్మార్గులు వస్తే కరెంటు పోతది.

రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్‌ ఇదే పరిస్థితి వస్తది. రైతుబంధు రాంరాం, దళితబంధుకు జై భీమ్‌ అనే వారు రాల్నా.. ప్రజలే నిర్ణయించాలి. ఎన్నికలు దగ్గరికి వచ్చినయ్‌ కాబట్టి అడ్డం పొడుగు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. గోండుగూడాలు, లంబాడి తండాలు బాగుపడాలని ఎన్నో సంవత్సరాలు కొట్లాడారు. గ్రామ పంచాయతీలు కావాలని కోరారు.

60 సంవత్సరాల్లో ఎవరైనా చేశారా? తెలంగాణ ప్రభుత్వం 196 గ్రామ పంచాయతీలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరికైతే సొంత జాగలున్నాయో.. నియోజక వర్గానికి 3వేల చొప్పున గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు మంజూరు చేస్తున్నాం. యాదవ సోదరులకు రెండో
విడత కింద గొర్రెల పంపిణీని చేపట్టబోతున్నాం.

Updated On 4 Jun 2023 2:10 PM GMT
krs

krs

Next Story