G20 | వన్ ఎర్త్‌..వన్ ఫ్యామిలీ..వన్ ఫ్యూచర్ ఇదే జీ-20శిఖరాగ్ర సదస్సు విజన్‌ సదస్సు ముగింపులో ప్రధాని మోడీ పిలుపు భద్రాతామండలిని విస్తరించాలని మోడీ ఉద్ఘాటన విధాత : భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన జీ-20దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసల్వాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. అధ్యక్ష పదవి మార్పిడికి చిహ్నంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను డసల్వా […]

G20 |

  • వన్ ఎర్త్‌..వన్ ఫ్యామిలీ..వన్ ఫ్యూచర్
  • ఇదే జీ-20శిఖరాగ్ర సదస్సు విజన్‌
  • సదస్సు ముగింపులో ప్రధాని మోడీ పిలుపు
  • భద్రాతామండలిని విస్తరించాలని మోడీ ఉద్ఘాటన

విధాత : భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన జీ-20దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసల్వాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. అధ్యక్ష పదవి మార్పిడికి చిహ్నంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను డసల్వా చేతికి మోడీ అందించారు.

ఈ సందర్భంగా ప్రపంచంలో శాంతి నెలకొనాలి.. కొత్త ఆశలు చిగురించాలి అంటూ సంస్కృత శ్లోకం 'స్వస్తి అస్తు విశ్వ' ప్రార్థనతో మోడీ సదస్సు ముగిసిందని ప్రకటించారు. అనంతరం సదస్సు తీర్మానాలను మోడీ ప్రకటించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తుకు సంబంధించిన విజన్ రోడ్ మ్యాప్‌పై చేస్తున్న కృషికి జీ-20శిఖరాగ్ర సదస్సు వేదికగా మారడం నాకెంతో సంతృప్తినిచ్చిందని సదస్సుగా ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. పలు కీలక అంశాలపై సదస్సు చర్చించిందన్నారు.

జీ-20 దేశాధినేతల మధ్య ఉక్రేయిన్ సమస్యపై విబేధాలున్నా నేటీ యుగంలో యుద్దం ఉండకూడదంటూ ఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించడం హర్షనీయమన్నారు సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్ధిక స్థిరత్వం వంటి వాటికి తోడు క్రిఫ్టో కరెన్సీ అంశం కొత్తగా సదస్సులో చర్చనీయాంశమైందన్నారు. క్రిప్టోను నియత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణామాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భద్రాతా మండలిని విస్తరించాల్సిందే : ప్రధాని మోడీ

ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోడీ పేర్కోన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికి ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

51దేశాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడినసమయంలో పరిస్థితులు వేరని, ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 200కు చేరువైందన్నారు. కాలానుగుణంగా ఎవరైతే మార్పు చెందరో వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని మోడీ స్పష్టం చేశారు. భద్రతా మండలి విస్తరణ అంశాన్ని జీ-20ముగింపు వేదికగా మోడీ నొక్కిచెప్పారు.

నవంబర్‌లో.. వర్చువల్ సమాశాలకు మోడీ సూచన

భారత్‌లో నిర్వహించిన జీ-20శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన తీర్మానాలు, సిఫారసులను సమీక్షించేందుకు నవంబర్ నెల చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని సభ్య దేశాధినేతలకు ప్రధాని మోడీ సూచించారు. నవంబర్ 30వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగనున్నందునా, అధ్యక్ష హోదాలో మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గత రెండు రోజుల్లో ఈ సదస్సులో మీరు మీ అభిప్రాయలు, సూచనలు, ప్రతిపాదనలు అందించారని, వాటిని విశ్లేషించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని మోడీ పేర్కోన్నారు. కాగా జీ-20దేశాల శిఖారాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోడీకి బైడెన్ సహా బ్రెజిల్‌, ప్రాన్స్ తదితర సభ్య దేశాధినేతలు తమ అభినందనలు తెలిపారు.

జీ-20శిఖరాగ్ర సదస్సులో 200గంటలు.. 300 సమావేశాలు

జీ-20శిఖరాగ్రత సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి భారత దౌత్యవేత్తల బృందం కీలక భూమిక పోషించిందని షెర్పా అమితాబ్ కాంత్ వెల్లడించారు. సదస్సు వివరాలను ఆయన వెల్లడిస్తూ సదస్సులో 200గంటల పాటు నిరంతర చర్చలు కొనసాగాయని, అదనపు కార్యదర్శులు ఈనం గంభీర్‌, కె.నాగరాజు నాయుడులతో కూడిన దౌత్యవేత్తల బృందం 300ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లుగా తెలిపారు.

సదస్సులో అత్యంత క్లిష్టమైనదిగా భౌగోళిక రాజకీయలపైన, ఉక్రేయిన్-రష్యా సమస్యపైన ఏకాభిప్రాయ సాధించడమేనన్నారు. ఇందుకు ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15ముసాదాయిలను చర్చించా మన్నారు. వారందరి కృషితోనే తొలి రోజునే జీ-20డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు.

వియత్నాం వెళ్లిన బైడెన్‌

జీ-20శిఖరాగ్ర సదస్సు ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాం దేశ పర్యటనకు వెళ్లారు. ఆదివారం ఉదయం జీ-20దేశాధినేతలతో పాటు బైడెన్‌ మహాత్మగాంధీ సమాధి వద్ధ నివాళి అర్పించిన అనంతరం విమానాశ్రయం చేరుకున్నారు.

అక్కడి నుండి తన ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో వియత్నాం వెళ్లారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాకా జోబైడెన్ తొలిసారిగా భారత్‌లో పర్యటించారు. కాగా మహాత్మగాంధీ సమాధి వద్ధ నివాళులర్పించేం దుకు వచ్చిన దేశాధినేతలు అంతా ఖద్దరు శాలువలు ధరించారు.

Updated On 12 Sep 2023 5:41 AM GMT
krs

krs

Next Story