Saturday, April 1, 2023
More
    Homelatestdrunken groom । ఫుల్లుగా మందేసి పెళ్లిపీటలపైనే వరుడి నిద్ర.. పెళ్లికూతురు రియాక్షన్‌?

    drunken groom । ఫుల్లుగా మందేసి పెళ్లిపీటలపైనే వరుడి నిద్ర.. పెళ్లికూతురు రియాక్షన్‌?

    drunken groom । పెళ్లికి వచ్చిన పెళ్లికొడుకు ఫ్రెండ్స్‌ కాస్త మందేసి సందడి చేయడం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఏకంగా పెళ్లికొడుకే ఫుల్లుగా మందు కొట్టేసి పెళ్లి పీటలపై కూర్చున్నాడు. డోస్‌ ఎక్కువైందేమో.. ఒక స్నేహితుడి ఒళ్లో తల పెట్టకుని హాయిగా బజ్జున్నాడు. ఈ ప్రబుద్ధుడే కాదు.. పెళ్లికొడుకు తరఫు బంధువుల్లో 95 శాతంపైగానే అంతా మందేసి ఉన్నారట. తిక్కరేగిపోయిన ఆ పెళ్లికూతురు.. ఇలాంటి తాగుబోతు నాకు వద్దేవద్దంటూ తెగేసి చెప్పడంతో పెళ్లికాకుండానే ఆ పెళ్లికొడుకు పెళ్లి పెటాకులైంది! ఆ వీడియో మీరు చూసేసి.. కాసేపు నవ్వుకోండి!

    విధాత : అది అస్సాంలోని నల్బరీ పట్టణం. ప్రసేన్‌జిత్‌ హలోయి అనే యువకుడికి పెళ్లి. ఘనంగా పెళ్లి (wedding) ఏర్పాట్లు చేశారు. అంతా సవ్యంగా సాగుతున్నదనుకున్న సమయంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. పెళ్లిబట్టలు కట్టుకుని, ఫుల్లుగా మందేసి వచ్చిన హలోయి.. పురోహితుడు చెప్పే మంత్రాలను చెప్పలేక నానా అవస్థ పడ్డాడు.

    నిద్రపోతానంటున్న వరుడితో అతడి స్నేహితులు మాట్లాడినా వినలేదు. అంతే.. పక్కనే ఉన్న స్నేహితుడి ఒళ్లో తల పెట్టకుని హాయిగా నిద్రపోయాడు. ఎంత కదిపినా కదిలితే ఒట్టు! ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నాయి.

    Marriage | వ‌రుడికి షాక్.. క‌ట్నం స‌రిపోలేద‌ని పెళ్లి క్యాన్షిల్ చేసిన వ‌ధువు

    నో చెప్పేసిన వధువు

    ‘పెళ్లి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. అన్నీ పద్ధతి ప్రకారం చేశాం. పెళ్లిని సక్రమంగా ముగించేందుకు మేం ప్రయత్నాలు చేశాం. కానీ.. వరుడు మద్యం తాగి ఉండటంతో పెళ్లిపీటలపై కూర్చునేందుకు పెళ్లికూతురు నో చెప్పేసింది. పెళ్లికొడుకు బంధువుల్లో 95శాతం మంది తాగేసి ఉన్నారు. మేంగ్రామ పెద్దను పిలిచాం. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం’ అని వధువు తాలూకు బంధువు ఒకరు చెప్పారు.

    Bride Makeup | బెడిసికొట్టిన వ‌ధువు మేక‌ప్.. పెళ్లిని ర‌ద్దు చేసిన వ‌రుడు

    తండ్రి ఇంకా..

    కారులోంచి దిగే సమయంలో కూడా వరుడు అస్సలు కంట్రోల్‌లో లేడట. తెగ ఊగిపోతున్నాడట. ఇక అతడి తండ్రి అయితే.. కొడుకును మించిపోయి.. సోయిలోనే లేడట! ఇదంతా చూసిన వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి ఖర్చులు మొత్తం పరిహారంగా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

    Hyderabad | టీచ‌ర్‌కు పెళ్లి సంబంధాలు.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థితో అదృశ్యం

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular