lunar Eclipse
ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా సాగే చంద్రగ్రహణాన్ని మానవాళి ఈ ఏడాది వీక్షించనుంది. 3 గంటల 28 నిమిషాల 23 సెకండ్ల పాలు సాగే ఈ గ్రహణం నవంబరు 18 లేదా 19 తేదీల్లో ఏర్పడుతుందని నాసా ప్రకటించింది.
సూర్య చంద్రుల మధ్యలోకి భూమి రావడం వల్ల చంద్రగహణం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. నవంబరు 19 అర్ధరాత్రి 97 శాతం చంద్రుడిపై సూర్య కాంతి పడకుండా భూమి అడ్డుకుంటుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది..
ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. అమెరికాలోని 50 రాష్ట్రాలకూ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఇది కనిపించడానికి వీలుంది.