విధాత, అదిలాబాద్ ప్రతినిధి: రాజ్యసభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)లో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో నుతన వధువరులు అదే గ్రామానికి చెందిన వధువు నవ్లె పల్లవి -మహారాష్ట్ర నాందెడ్ జిల్లా పార్వ గ్రామానికి చెందిన వరుడు బోనే గజానన్ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావ్ పాల్గొని నూతన వదువరులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే రాథొడ్ బాపు రావు మాట్లాడుతూ..
ముఖ్రా కె గ్రామంలో ప్రతి కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారని నాటిన ప్రతి మొక్క 100% బ్రతికిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.