Bollywood |
విధాత: రాజకీయాలకు, సినిమాలకు ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ (Bollywood0 హీరోయిన్ పరిణితీ చోప్రాల వివాహం నేపథ్యంలో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ రెండు రంగాలలోని వారు జంట కావడం మాత్రం టాలీవుడ్‌లో ఉన్నంతగా బాలీవుడ్‌లో లేదన్నది గమనించాల్సిన విషయం. కానీ ఇప్పడు పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. \
బాలీవుడ్ భామలు ఏరికోరి రాజకీయాల నుంచి వారి భాగస్వాములను ఎంచుకుంటున్నారు. ఇటీవలే స్వరాభాస్కర్ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫాహద్ అహ్మద్ ను మనువాడగా.. తాజాగా పరిణితీ చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. దీంతో సౌత్ తరహాలోనే సినిమాకు రాజకీయాలకు బంధం పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది.
Everything I prayed for .. I said yes! 💍
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਮਿਹਰ ਕਰਨ। 🙏🏻 pic.twitter.com/xREJWjEr7n— Parineeti Chopra (@ParineetiChopra) May 13, 2023
రాజకీయాలకు హిందీ ఆమడ దూరం
పాలిటిక్స్ గురించి మన హీరోలు మాట్లాడినంత చొరవగా హిందీ పరిశ్రమ హీరోలు, పెద్దలు మాట్లాడరన్నది తెలిసిన విషయమే. సౌత్‌లో ఎంజీఆర్, కరుణానిధి, డా.రాజ్‌కుమార్, ఎన్టీఆర్, జయలలిత, పవన్‌కల్యాణ్, కమల్‌హాసన్, కుష్బూ ఇలా పదుల సంఖ్యలో తారలు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్నా.. బాలీవుడ్‌లో ఇలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ ఇప్పుడిప్పడే పరిస్థితి మారుతోంది. స్వరభాస్కర్, కంగనా లాంటి వాళ్లు తమ తమ రాజకీయ అభిప్రాయాలను కాస్త స్వేచ్ఛగా బయట మాట్లాడుతున్నారు.
View this post on Instagram
ఈ పెళ్లిల్లకు ఏమిటీ కారణం?
చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావడమే బాలీవుడ్ భామలు ఈ వివాహలకు ఓకే చెప్పేలా చేస్తోందన్నది ఒక వివరణ. ఇంతకుముందులా నాటు నాయకులే కాకుండా ఇప్పుడు ఉన్నత విద్యావంతులు కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో.. వారితో వివాహ బంధం గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఈ ముద్దుగుమ్మలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. స్వరాభాస్కర్ వివాహం చేసుకున్న ఫాహద్ .. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్‌లో చదువుకోగా.. పరిణితీ భర్త చద్దా.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టా పొందాడు.
మరి అయితే ఈ జంటల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు రావా అని ఎవరికైనా అనుమానం రావొచ్చు. కానీ ప్రేమ అన్ని అంతరాలను అధిగమిస్తుందని, కులం, మతం, రాజకీయాలను పక్కకు పెట్టి మనసులను ఒకటి చేసి ఉంచుతుందని ఇలాంటి జంటలు చెబుతూ ఉంటాయి.