విధాత: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్ననాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే మందే ముగించారు.
దీంతో నాలుగు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫి (Border–Gavaskar Trophy)ని 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్నది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ట్రావిన్ హెడ్ (90), లబుషేన్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
Moment to savour 👏👏
This is #TeamIndia 🇮🇳#INDvAUS | @mastercardindia pic.twitter.com/j6ZR8R8fZr
— BCCI (@BCCI) March 13, 2023
భారత బౌలర్లలో అశ్విన్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480, భారత్ 571 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి.
ఆసీస్‌తో నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతున్న సమయంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ( WTC) ఫైనలిస్టు జట్లు ఏవో తేలిపోయాయి. భారత్ WTC ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. WTC ఫైనల్ జూన్ 7న లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనున్నది.