విధాత: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనోద్యమం చేపట్టటంతో దాన్ని రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. దీంతో రైతుల నిరసనోద్యమం నిలిచిపోయింది. కానీ మాస్టర్ ప్లాన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమనీ, దాన్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకొనేలా ఆదేశించాలని ప్రజా శాంతి పార్టీ నేత కేఏ పాల్ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను ప్రజామోదం లేకుండా, రైతుల అనుమతి లేకుండా రూపొందించారని కేఏ […]

విధాత: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనోద్యమం చేపట్టటంతో దాన్ని రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. దీంతో రైతుల నిరసనోద్యమం నిలిచిపోయింది. కానీ మాస్టర్ ప్లాన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమనీ, దాన్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకొనేలా ఆదేశించాలని ప్రజా శాంతి పార్టీ నేత కేఏ పాల్ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను ప్రజామోదం లేకుండా, రైతుల అనుమతి లేకుండా రూపొందించారని కేఏ పాల్ ఆరోపించారు. ఈ కారణం చేతనే కామారెడ్డి పట్టణ పరిసర గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు మాస్టర్ ప్లాన్ ను తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు.

ప్రజా వ్యతిరేకతతో కౌన్సిల్ దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా అది చెల్లనేదరనీ, ఆ హక్కు కౌన్సిల్ కు లేదని పాల్ అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేఏ పాల్ పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మాస్టర్ ప్లాన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13వ తేదీలోపు తన నిర్ణయాన్ని సమర్పించాలని ఆదేశించింది.

Updated On 31 Jan 2023 1:51 AM GMT
Somu

Somu

Next Story