AP  ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించని కేంద్రం పెద్దలు 9 రాష్ట్రాలతో పాటే లోక్‌సభ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్‌, మేలో జరగొచ్చు అన్న వ్యాఖ్యల ఉద్దేశం! టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, రాష్ట్రం బాగుండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్‌ అభిప్రాయమని, పొత్తుల […]

AP

  • ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించని కేంద్రం పెద్దలు
  • 9 రాష్ట్రాలతో పాటే లోక్‌సభ ఎన్నికలు
  • తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్‌, మేలో జరగొచ్చు అన్న వ్యాఖ్యల ఉద్దేశం!

టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, రాష్ట్రం బాగుండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని పవన్‌ అభిప్రాయమని, పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.

ప్రస్తుతానికి ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నది. బీజేపీ భావజాలాన్ని వామపక్షాలూ ఎన్నటికీ అంగీకరించరు. అలాగే ప్రస్తుతం వామపక్షాలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తే వామపక్షాలు తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నది.

చంద్రబాబు అరెస్టువైసీపీ రాజకీయ కక్ష్యలో భాగమని, దీనిపై కేంద్రంలోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అంతేకాదు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేయించే ధైర్యం జగన్‌కు లేదని ఆరోపించారు.

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పురందరేశ్వరీ కమలనాథులు కట్టబెట్టడం వల్ల చంద్రబాబు అరెస్టు అంశంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఆమెతో పాటు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు కూడా తప్పుపడుతున్నారు. అయితే చంద్రబాబుకు కోర్టు రిమాండ్‌ విధించిన తర్వాత టీడీపీ, జనసేన ఇచ్చిన బందు పిలుపునకు బీజేపీ దూరంగా ఉన్నాయి.

వామపక్షాలు కూడా ఆ బందుకు మద్దతు తెలిపాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఉన్నదని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఈ విషయంపై కొంత ఆచితూచి స్పందిస్తున్నారు. కానీ మోడీ-షాలు తమ రాజకీయ ప్రయోజనాల మేరకే ఏ పార్టీతోనైనా కలుస్తారు? ఏ పార్టీనైనా వదులుకుంటారన్నది గడిచిన తొమ్మిదేళ్ల అనుభవాలు అనేకం ఉన్నాయి.

కేంద్రంలో ఈ ఏడాది చివరల్లో జరిగే ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలలో జరిగే ఏపీ, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను లోక సభ ఎన్నికలతో పాటే నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఈ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సంప్రదించి ఉండొచ్చు. అందుకే మంత్రి కేటీఆర్‌ తెలంగాణలో అసెంబ్లీ ఏప్రిల్‌, మే నెలలో జరగొచ్చు అని అన్నారు.

సీఎం కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ మంత్రులు కూడా బీఆర్‌ఎస్‌ జమిలి ఎన్నిలకు కూడా సిద్ధమే కొన్నిరోజులుగా అంటున్న విషయాన్ని గమమనించాలి. అంతేకాదు ఇక్కడ ఈ రెండు పార్టీలకు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అంతేకాదు బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటేనని కాంగ్రెస్‌, వామపక్ష నేతలు, శరద్‌పవార్‌, శివసేన, జేడీఎస్‌ నేతలు కూడా విమర్శించారు.

ఈ రెండుపార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకే లిక్కర్‌ కుంభకోణం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని ఈడీ ప్రశ్నించడమే కాదు అరెస్టు చేసిందని, కానీ ఇదే కేసులో ఆరోపణలు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది.

అయితే దీనిపై స్పందించిన ఆమె ఈ నోటీసులను సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. అలాగే ప్రస్తుతం ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అక్కడ జరిగే రాజకీయ పరిణామాల వెనుక కేంద్రం ఉన్నదనే ఆరోపణల నుంచి బైట పడేందుకే కొన్ని ప్రకటనలు చేయిస్తున్నట్టు కనిపిస్తున్నది.

కానీ ఈ ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీసగఢ్‌, తెలంగాణ, మిజోరాం ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే కాకుండా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ, సిక్కిం, ఒడిషా, అరుణాచల్‌ప్రదేశ్‌ లోక్‌సభతో ఎన్నికలతో పాటే జరిగితే ఏపీలో వైపీసీ, బీజేపీల మధ్య లోపాయీకారీ ఒప్పందం కుదిరినట్టే భావించాలి.

Updated On 15 Sep 2023 3:59 PM GMT
somu

somu

Next Story