Summer Food | వేసవిలో సురక్షితంగా ఉండాలంటే ఈ 10 రకాల ఫుడ్ తప్పనిసరి..!
Summer Food | ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 8 గంటల నుంచి సూర్యుడు( Sun ) తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడిమికి వృద్ధులు, రైతులు వడదెబ్బ( Sun Stroke )కు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలన్నా.. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలనుకున్నా.. ఈ 10 రకాల ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆహారం మనల్ని డీహైడ్రేషన్( Dehydration ) నుంచి […]

Summer Food | ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 8 గంటల నుంచి సూర్యుడు( Sun ) తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడిమికి వృద్ధులు, రైతులు వడదెబ్బ( Sun Stroke )కు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండాలన్నా.. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలనుకున్నా.. ఈ 10 రకాల ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆహారం మనల్ని డీహైడ్రేషన్( Dehydration ) నుంచి కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్‌లను కూడా అందిస్తాయి. మరి ఆ పది రకాల ఫుడ్స్ ఏంటో చూసేద్దాం..
దోసకాయ : దోసకాయ మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. దోసకాయలో నీరుతో పాటు ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సీ కూడా ఉంటుంది. కాబట్టి దోసకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఫలితంగా దోసకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
పుచ్చకాయ : పుచ్చకాయ( Watermelon ) కూడా మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. ఇందులో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. పుచ్చకాయలు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతాయి. ఈ పండులో లైకోపీన్ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. వేడిమి నుంచి చర్మాన్ని సురక్షితంగా ఉంచేందుకు సహాయపడుతాయి పుచ్చకాయలు.
కొబ్బరి నీళ్లు : కొబ్బరి నీరు( Coconut Water ) సహజ ఎలక్ట్రోలైట్ పానీయం. శరీరానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కానివ్వదు. అంతే కాకుండా కొబ్బరి నీళ్లలో ఉండే పోటాషియం హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రిస్తుంది.
నిమ్మ కాయలు : నిమ్మ( Lemon )లో పుష్కలంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. శరీరంలోని వేడిని కూడా తొలగిస్తుంది. రోజుకు రెండు గ్లాసుల నిమ్మరసం తాగడం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
ఆకుకూరలు : ఆకుపచ్చని ఆకుకూరలకు( Green Leaves ) అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆకుకూరలు మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజామాలను ఇస్తాయి. శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తాయి.
పుదీనా : పుదీనా( Menthol ) కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పుదీనా రసాన్ని తీసుకోవడం వల్ల శరీరమంతా ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి కలుగుతుంది.
పైనాపిల్ : పైనాపిల్( Pineapple )లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. సీ విటమిన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
టమాటాలు : టమాటా( Tomata )లో లైకోపీన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే సీ విటమిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
పెరుగు : పెరుగు( Curd ) శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. కాల్షియం కూడా లభిస్తుంది.
సోంపు గింజలు : శరీరానికి చల్లదనాన్ని అందించే లక్షణాలు సోంపు గింజలు కలిగి ఉంటాయి. శరీరంలో మంటలను తగ్గిస్తాయి. సోంపు గింజలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
