విధాత: సాధారణంగా చాలామంది స్టార్స్‌కు ఎంతోమంది సన్నిహిత స్నేహితులు ఉంటారు. ఆయా హీరోల సీక్రెట్స్ వారికైతే బాగా తెలుస్తాయి. అందుకే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షోకి ప్రభాస్‌కు జోడీగా గోపీచంద్‌ను పిలిపించారు. ఎందుకంటే ప్రభాస్‌కు చెందిన చాలా విషయాలు గోపీచంద్‌కు తెలుసు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ఎలాంటి దాపరికం లేని ఫ్రెండ్స్. ఇక రామ్ చరణ్, ప్రభాస్‌ల మధ్య కూడా చాలా సాన్నిహిత్యం ఉంది. దాంతో ప్రభాస్ సీక్రెట్‌లను రివీల్ చేయడానికి బాలయ్య.. గోపీచంద్, రామ్ […]

విధాత: సాధారణంగా చాలామంది స్టార్స్‌కు ఎంతోమంది సన్నిహిత స్నేహితులు ఉంటారు. ఆయా హీరోల సీక్రెట్స్ వారికైతే బాగా తెలుస్తాయి. అందుకే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షోకి ప్రభాస్‌కు జోడీగా గోపీచంద్‌ను పిలిపించారు. ఎందుకంటే ప్రభాస్‌కు చెందిన చాలా విషయాలు గోపీచంద్‌కు తెలుసు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ఎలాంటి దాపరికం లేని ఫ్రెండ్స్.

ఇక రామ్ చరణ్, ప్రభాస్‌ల మధ్య కూడా చాలా సాన్నిహిత్యం ఉంది. దాంతో ప్రభాస్ సీక్రెట్‌లను రివీల్ చేయడానికి బాలయ్య.. గోపీచంద్, రామ్ చరణ్ వంటి వారి సహాయం తీసుకున్నాడు. ఒకప్పుడు రాజీవ్ కనకాల, కమెడియన్ శ్రీనివాసరెడ్డిలు ఎంతో తిక్ ఫ్రెండ్స్ కానీ.. ఆ తర్వాత వారికి విభేదాలు వచ్చాయి అంటారు.

విషయానికి వస్తే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో‌లో పాల్గొన్న విషయం తెలిసిందే ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను నటుడు ప్రభాస్ శీను బయట పెట్టాడు. దీంతో ప్రభాస్ పేరుతో పాటు ప్రభాస్ శీను పేరు కూడా బాగా హల్చల్ చేస్తోంది.

ప్రభాస్ శీను కమెడియన్‌గా టాలీవుడ్‌లో చాలా సినిమాలు చేశాడు. ప్రభాస్‌కు ఆయన పర్సనల్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శీను.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్‌గా ఉన్నాను. ప్రభాస్‌ను రాజుగా తనను మంత్రిగా పిలిచేవారు. అలాగే ప్రభాస్‌ను దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ప్రభాస్‌కు బలం, బలహీనత రెండు కూడా మంచితనమే అని చెప్పుకొచ్చాడు ప్రభాస్ శీను.

ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ గతంలో తనతో ఎలా ఉండేవాడో.. ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నాడు. స్టార్‌డమ్ రాగానే మారిపోయే వ్యక్తిత్వం ప్రభాస్‌ది కాదు.. అయితే ప్రభాస్‌కి కోపం వస్తే అసలు మాట్లాడడు.. ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో.. ఆయన సైలెన్స్ అంత వైలెంట్‌గా ఉంటుంది. ప్రభాస్ మంచితనం చూసినవారు ఆయనతో గొడవ పడాలని కోరుకోరు.. అని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రభాస్‌కు సంబంధించిన చాలా విషయాలు ప్రభాస్ శీను బయట పెట్టడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

Updated On 30 Dec 2022 6:53 AM GMT
krs

krs

Next Story