విధాత: వ‌చ్చే ఏడాది(2023)కి సంబంధించి సెల‌వు దినాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రక‌టించింది. సాధార‌ణ‌, ఐచ్ఛిక సెల‌వుల‌తో కూడిన జాబితాను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈమేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 28 సాధార‌ణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవుల‌ను గుర్తించారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. ముఖ్యమైన సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, 14 భోగీ, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం, మార్చి […]

విధాత: వ‌చ్చే ఏడాది(2023)కి సంబంధించి సెల‌వు దినాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రక‌టించింది. సాధార‌ణ‌, ఐచ్ఛిక సెల‌వుల‌తో కూడిన జాబితాను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

ఈమేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 28 సాధార‌ణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవుల‌ను గుర్తించారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు.

ముఖ్యమైన సెలవులు

జనవరి 1 నూతన సంవత్సరం, 14 భోగీ, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం,
మార్చి 18 మహాశివరాత్రి, 7 హోళీ, 22 ఉగాది, 30 శ్రీరామనవమి,
ఏప్రిల్ 14 అంబేడ్కర్‌ జయంతి, 22 రంజాన్,
జూన్ 6 బ‌క్రీద్,
జులై 17 బోనాలు, 29 మొహ‌ర్రం,
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం,
సెప్టెంబ‌ర్ 18 వినాయ‌క చ‌వితి,
అక్టోబరు 24 విజయదశమి,
న‌వంబ‌ర్ 12 దీపావ‌ళి,
డిసెంబరు 25 క్రిస్‌మ్‌సగా పేర్కొన్నారు. అయితే వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం నాడు నాలుగు సెలవు దినాలు రావడం గమనార్హం.

Updated On 16 Nov 2022 1:15 PM GMT
krs

krs

Next Story