- కేసీఆర్ పెద్ద అబద్దాల కోరు
- కేసీఆర్ సర్కారు ఫీజు కట్ చేయండి
- హామీలు నెరవేర్చకపోతే.. BRS నేతలను ఊర్లల్లోకి రానివ్వకండి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే బీఆర్ఎస్ (BRS) నాయకులను ఊర్లలోకి రానివ్వకండి అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఊర్లలోకి వచ్చిన నాయకులను నిలదీయాలని కోరారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాలలో శనివారం జరిగిన బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఈటల ప్రసంగించారు.
ఉద్యమంలో (movement)పాల్గొన్న నన్ను మెడబట్టి గెంటేశారు
నేను తెలంగాణ (Telangana)ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ బయటికి వెళ్ళగొడితే హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అసెంబ్లీకి వెళ్లాను. సమస్యల గురించి మాట్లాడదామంటే రెండు సార్లు మెడలు పట్టి బయటికి గెంటారు. మొన్న అవకాశం వస్తే అనేక ప్రజా సమస్యలను ప్రస్తావించాను. నేను నిలబడ గానే మైక్ కట్ చేస్తారు అంటూ ఈటల తన బాధను వ్యక్తం చేశారు.
కేసీఆర్ (kcr)అబద్దాలకోరు
మొన్న సీఎం కేసీఆర్ శాసనసభలో ఉండగా అన్ని అంశాలు ప్రస్తావించాను. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బాకీలు ఇవ్వాలని అడిగితే ఇస్తా అన్నారు. ఇవ్వలేదు. యూనివర్సిటీ మెస్ ఫీజులు పెంచుతా అన్నారు. పెంచలేదు. వరంగల్లో రెండురోజులు పడుకొని డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టి ఇస్తా అని మాట ఇచ్చి వెళ్లారు. ఇచ్చారా అమ్మ ? అంటూ ఈటల ప్రశ్నించారు.
ఎవరి జాగాలో వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మూడులక్షలు మాత్రమే ఇస్తా అంటున్నాడు. ధరలు పెరిగాయా తగ్గాయా? ఆయన ఇచ్చే డబ్బులు పునాదులకైనా సరిపోతాయా? KCR నౌకర్లు ఇవ్వలేదు.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అబద్దాల కోరు సీఎం అవునా కాదా ఆలోచన చేయండంటూ కోరారు. ప్రతి మాటలో అబద్ధము, ప్రతి పనిలో మోసం ఉందన్నారు.
రూ.300 కోట్ల హామీ ఏమైంది
రాష్ట్ర ప్రభుత్వం (state government)నగరానికి ప్రతీ ఏటా రూ. 300 కోట్లు కేటాయిస్తానని చెప్పి మాట తప్పింది. నగరంలో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడంలేదు. ఎన్నో ఏండ్లుగా నగరం చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్నది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు హంగూ ఆర్భాటం చేస్తుందే తప్ప ఆ సమస్యలకు పరిష్కారం చూపటంలేదు అంటూ ఈటెల విమర్శించారు.
మన తలరాత మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఓట్లు వేయకుండా వారి ఫీజు గుంజేయండి. పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు ఏది పోదు అన్ని సరైన సమయంలో ఇస్తామని ఈటల రాజేందర్ అన్నారు.
ఈ సమావేశంల్లో బీజేపీ జిల్లా వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రావు, పద్మ, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, అచ్చ విద్యాసాగర్, జిల్లా ఇంఛార్జి మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.