Train | Viral Video | రైల్లో దొంగ‌త‌నాలు త‌రుచుగా జ‌రుగుతూనే ఉంటాయి. దొంగ‌త‌నం చేశాక దొంగ‌లు అక్క‌డ్నుంచి మెల్ల‌గా జారుకుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ప్ర‌యాణికుల‌కు దొరికిపోయాడు. రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ‌ను ప్ర‌యాణికులు ప‌ట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసుల‌కు అప్ప‌గించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుస‌రాయ్ జిల్లాలోని క‌టిహార్ నుంచి స‌మ‌స్తిపుర్‌కు రైలు బ‌య‌ల్దేరింది. ఈ రైల్లో ఎక్కిన దొంగ‌.. ఓ మ‌హిళ ప‌ర్సును కాజేశాడు. అనంత‌రం పారిపోయేందుకు ప్ర‌య‌త్నించి, రైలు కిటికీని ప‌ట్టుకున్నాడు. […]

Train | Viral Video |

రైల్లో దొంగ‌త‌నాలు త‌రుచుగా జ‌రుగుతూనే ఉంటాయి. దొంగ‌త‌నం చేశాక దొంగ‌లు అక్క‌డ్నుంచి మెల్ల‌గా జారుకుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ప్ర‌యాణికుల‌కు దొరికిపోయాడు. రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ‌ను ప్ర‌యాణికులు ప‌ట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసుల‌కు అప్ప‌గించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుస‌రాయ్ జిల్లాలోని క‌టిహార్ నుంచి స‌మ‌స్తిపుర్‌కు రైలు బ‌య‌ల్దేరింది. ఈ రైల్లో ఎక్కిన దొంగ‌.. ఓ మ‌హిళ ప‌ర్సును కాజేశాడు. అనంత‌రం పారిపోయేందుకు ప్ర‌య‌త్నించి, రైలు కిటికీని ప‌ట్టుకున్నాడు. గ‌మ‌నించిన ప్ర‌యాణికులు.. దొంగ చేతుల‌ను, కాళ్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నారు.

త‌న‌ను ర‌క్షించండి అంటూ ఆ దొంగ అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇక బచ్వాడా జంక్ష‌న్ రాగానే దొంగ‌ను రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసుల‌కు అప్ప‌గించారు. దొంగ వ‌ద్ద ఉన్న ప‌ర్సును పోలీసులు రిక‌వ‌రీ చేసి, మ‌హిళ‌కు అప్ప‌గించారు.

Updated On 5 Sep 2023 2:40 AM GMT
sahasra

sahasra

Next Story