Ram Charan | జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కడం తెలుగు ఇండస్ట్రీ హీరోలకు గగనమైపోయింది. ఎలాంటి పాత్రలో అయినా లీనమై చేసే ఏ నటుడికైనా గుర్తింపుని ఇచ్చేది ప్రేక్షకుల ప్రశంసలు, అవార్డులే. పాత కాలంలో ఇంతటి సాంకేతికత, ప్రోత్సాహం లేకపోవడం వల్ల చాలామంది నటులు ప్రేక్షకుల వరకే ఉత్తమ నటులుగా నిలిచారు. వాళ్ళకు దక్కిన అవార్డులు కూడా తక్కువే. అయితే ఇప్పటి రోజుల్లో సినిమా ఎలా ఉన్నా కథలో లీనమై పోయి నటించేసినా అవార్డుల […]

Ram Charan |
జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కడం తెలుగు ఇండస్ట్రీ హీరోలకు గగనమైపోయింది. ఎలాంటి పాత్రలో అయినా లీనమై చేసే ఏ నటుడికైనా గుర్తింపుని ఇచ్చేది ప్రేక్షకుల ప్రశంసలు, అవార్డులే. పాత కాలంలో ఇంతటి సాంకేతికత, ప్రోత్సాహం లేకపోవడం వల్ల చాలామంది నటులు ప్రేక్షకుల వరకే ఉత్తమ నటులుగా నిలిచారు.
వాళ్ళకు దక్కిన అవార్డులు కూడా తక్కువే. అయితే ఇప్పటి రోజుల్లో సినిమా ఎలా ఉన్నా కథలో లీనమై పోయి నటించేసినా అవార్డుల సంగతికి వచ్చేసరికి నటుడికి ఎన్నో కొలమానాలు అడ్డుగా ఉంటాయి. దీనికి చక్కని ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణే. నటుడిగా రామ్ చరణ్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నాడు.
రీసెంట్‌గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, అందులో రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలెద్దు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమాలో అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అటు నుంచి ప్రతి సినిమాకు తన నటనకు మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నాడు రామ్ చరణ్. అయితే అవార్డుల సంగతికి వచ్చేసరికి అతనికి అస్తమానూ నిరాశే మిగిలింది. గతంలోనూ రామ్ చరణ్ నటనకు దక్కాల్సిన పలు అవార్డులు దక్కకుండా పోయాయి. ఇలా జరగడం ఇది మొదటి సారి కాదు, మూడోసారి. విషయంలోకి వెళితే..
తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలోనూ రామ్ చరణ్‌కి అవార్డు దక్కలేదు. అతనికి కాకుండా అల్లు అర్జున్‌కి ‘పుష్ప’ సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడి కేటగిరీలో మొదటిసారి తెలుగు వ్యక్తిగా అల్లు అర్జున్ ఎంపిక కావడం విశేషం. అయితే రామ్ చరణ్‌కి రాకపోవడంపై ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు.
‘మగధీర’ నుంచి చూసుకుంటే నటన పరంగా మంచి మార్కులు పడ్డా.. ఈ మూవీకి అప్పట్లోనే నంది అవార్డు రావాల్సి ఉండగా.. దానిని అప్పటి కేంద్రమంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు తీసుకున్నారు. ‘మేస్త్రి’ సినిమాకు గాను ఈ అవార్జు దక్కింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయమది. అప్పటికీ దాసరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
చిరంజీవికి వ్యతిరేకంగానే ఈ సినిమాను తీశారని, అందుకే అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాసరికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కేలా చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించిన తీరుకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కుతుంది అనుకున్నారు అంతా. జాతీయ అవార్డు కూడా ఊహించారు.
కానీ ఆ టర్మ్‌లో కీర్తీ సురేష్, ఆయుష్మాన్ ఖురానా సినిమాలు పోటీ పడ్డాయి. చివరకు ఆయుష్మాన్ ఖురానాకు దక్కింది. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను చరణ్, బన్నీ ఇద్దరూ అవార్డుల కోసం పోటీ పడుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది కానీ అల్లు అర్జున్‌కే అవార్డు వచ్చింది.
ముచ్చటగా మూడు సార్లు రామ్ చరణ్ బరిలో నిలిచినా కూడా అవార్డు అంచనాల వరకూ వెళ్ళి వెనుకకు తిరిగివచ్చాడు. కాలం కలిసిరానప్పుడు కాస్త మౌనంగా మన పని మనం చేసుకుపోవడమే మంచిది. అయితే రామ్ చరణ్ మాత్రం హుందాగా తన విశెష్ తెలియజేశాడు.
పుష్ప టీమ్‌కు డబుల్ చీర్స్ అంటూ మొదలుపెట్టి అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్‌కు కంగ్రాట్స్ తెలియజేశాడు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో అవార్డులు అందుకున్న ఆరుగురితోపాటు, ఉప్పెన యూనిట్ కు, ఉత్తమ నటిగా ఎంపికైనా ఆలియా భట్‌కు కూడా ప్రత్యేక అభినందనలు రామ్ చరణ్ తెలియజేశాడు.
