Couple Intercourse |
సహజమైన పద్ధతుల్లో శృంగారం చేస్తే మనసుకు ఎంతో హాయి కలుగుతోంది. శరీరమంతా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అదే అసహజ పద్ధతుల్లో శృంగారం చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అసహజ శృంగారం చేసే వారు గొంతు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది.
ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో చాలా మంది అసహజ శృంగార పద్ధతుల్లో ఆనందాన్ని పొందుతుంటారు. మరి ముఖ్యంగా ఓరల్ శృంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వల్ల హెచ్‌పీవీ(హ్యుమన్ పాపిల్లోమా వైరస్ ) అనే వైరస్.. భాగస్వామికి వ్యాపిస్తుంది. ఇది గర్భాశయ క్యాన్సర్లకు ప్రధాన కారణం. దీంతో ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని పిలువబడే ఒక రకమైన గొంతు క్యాన్సర్ సంభవిస్తుంది.
ఇది టాన్సిల్స్, గొంతు వెనుక భాగాన్ని ప్రభావితం చేస్తోందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే పాశ్చాత్య దేశాల్లో గొంతు క్యాన్సర్ కేసులు అధికంగా పెరుగుతున్నాయని తేలింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఓరల్ శృంగారమే అని తేలింది. ఓరల్ శృంగారం చేయని వారి కన్నా.. చేసే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం 8.5 రెట్లు అధికంగా ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
అయితే ఈ వ్యాధి తానంతట అదే తగ్గిపోతుందని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే హెచ్‌పీవీకి వ్యాక్సిన్ ఉంది. మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ల నుంచి రక్షణ పొందొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.