V Hanumantha Rao రైతు వ్యతిరేకి సీఎం కేసీఆర్ : హనుమంతరావు ధ్వజం విధాత: భూమి కోల్పోతున్న రైతులు న్యాయం అడిగితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సీఎం కేసీఆర్ సర్కార్ రైతు వ్యతిరేక సర్కార్ అని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నల్గొండ జైలుకు తరలించారు. బాధిత రైతులను […]

V Hanumantha Rao

రైతు వ్యతిరేకి సీఎం కేసీఆర్ : హనుమంతరావు ధ్వజం

విధాత: భూమి కోల్పోతున్న రైతులు న్యాయం అడిగితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సీఎం కేసీఆర్ సర్కార్ రైతు వ్యతిరేక సర్కార్ అని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నల్గొండ జైలుకు తరలించారు.

బాధిత రైతులను హనుమంతరావు సోమవారం నల్గొండ జైల్లో పరామర్శించి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ గతంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిజైల్లో పెట్టాడని, ఇప్పుడు బోనగిరిలో అదే పని చేశాడన్నారు.

దేశంలో రైతులకు సంకెళ్లు వేసిన వ్యక్తి కెసిఆర్ ఒక్కడేనన్నారు. కేసీఆర్ నినాదం కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటూ రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నరన్నారు. రైతులు ఏమైనా ఆయుధాలు పట్టుకొని నిరసనకు దిగారా అని, ఎందుకు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని హనుమంతరావు నిలదీశారు.

రైతుల ఉద్యమాన్ని ఉదృతం కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఒకవైపు రాష్ట్రంలో రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెడుతూ ఇంకోవైపు రాష్ట్రావతరణలో రైతు దినోత్సవ పేరుతో ప్రభుత్వం మోసపూరిత వేషాలు వేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు.

కేసీఅర్ వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలుస్తామనుకుంటున్నాడని, ఆ రోజులు పోయాయన్నారు. కెసిఆర్ ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఇంటికి ఉద్యోగము, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఇండ్ల పంపిణీ లో అనరులకే ఇచ్చారన్నారు. దళిత బందులో అవినీతి జరిగిందని సీఎం స్వయంగా చెప్పారన్నారు.

రైతుల భూమి రైతులకు ఇచ్చేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని, రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఈ సమస్యపై కాంగ్రెస్ పోరాట ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షుడు కే శంకర్ నాయక్ తోపాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated On 6 Jun 2023 1:53 AM GMT
krs

krs

Next Story