Kaan Marriage | విధాత:  జీవితంలో స్థిరపడక, ప్రేమలో విఫలమై, అమ్మాయిలు నచ్చక ఎంతో మంది మగాళ్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు.. ఈ రైతును ఆదర్శంగా తీసుకోవాలి. 61 ఏండ్ల వయసులో 88వ పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ నిత్య పెళ్లికుమారుడు. మీ ఇంట్లో ఈ 6 రకాల ఫోటోలు ఉన్నాయా..? అయితే అంతా శుభమే జరుగుతుందట.. 14 ఏండ్ల వయసులో తొలి వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా మళ్లీ […]

Kaan Marriage | విధాత: జీవితంలో స్థిరపడక, ప్రేమలో విఫలమై, అమ్మాయిలు నచ్చక ఎంతో మంది మగాళ్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు.. ఈ రైతును ఆదర్శంగా తీసుకోవాలి. 61 ఏండ్ల వయసులో 88వ పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ నిత్య పెళ్లికుమారుడు.

మీ ఇంట్లో ఈ 6 రకాల ఫోటోలు ఉన్నాయా..? అయితే అంతా శుభమే జరుగుతుందట..

14 ఏండ్ల వయసులో తొలి వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దాదాపు 46 ఏండ్ల దాంపత్య జీవితంలో సంవత్సరానికి కనీసం రెండు పెళ్లిళ్లు చేసుకుని ఉంటాడు ఈ రైతు. మరి ఆ నిత్య పెళ్లి కొడుకు గురించి తెలుసుకోవాలంటే ఇండోనేషియా వెళ్లక తప్పదు.

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చే సినిమాలివే

ఇండోనేషియాలోని వెస్ట్ జావాకు చెందిన ఖాన్ అనే వ్యక్తి ఓ సామాన్య రైతు. అతనికి ఎలాంటి ఆస్తులు, అంతస్థులు లేవు. ఆర్థిక సంపాదన కూడా అంతంతనే. కానీ ప్రేమించే గుణం మాత్రం ఆయనలో కొండంత ఉంది. అందుకేనేమో తనకు ఇష్టమైన మహిళను ప్రేమించి, పెళ్లి చేసుకునేవాడు.

ఈ సుగంధ ద్రవ్యాలతో.. ఆ సమస్యలు దూరం చేసుకోండి..

అలా ఇప్పటి వరకు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాజాగా 88వ పెళ్లికి సిద్ధమయ్యాడు ఖాన్. 86వ భార్య కొద్ది రోజుల క్రితం రైతుకు దూరమైంది. కానీ ఆమె తనను మరిచిపోవడం లేదు. నిత్యం ప్రేమిస్తూనే ఉంది. ఆమె ప్రేమను కాదనలేక.. మళ్లీ ఆమెను 88వ భార్యగా చేసుకునేందుకు ఖాన్ నిర్ణయం తీసుకున్నాడు.

14 ఏండ్ల వయసులో తొలి వివాహం..

ఖాన్ తన 14వ ఏటనే వివాహం చేసుకున్నాడు. తన పేదరికం కారణంగా మొదటి భార్య రెండేండ్లకే విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. ఆమె అతని కంటే రెండేండ్లు పెద్దది కూడా. అయితే మొదటి భార్య విడాకులు ఇవ్వడంతో ఖాన్ కు తీవ్రమైన కోపం వచ్చిందట. ఆ తర్వాత తనకేం తక్కువ అనుకొని.. తనతో మహిళలు ప్రేమలో పడేలా చేసుకున్నాడు.

అప్సరా రాణి.. ఆ అందానికి ఎవ్వడైనా ఫిదా కావాల్సిందే!

మహిళలను ప్రేమించడం మొదలుపెట్టి.. ఏకంగా 88 పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాను మహిళలను ఎవరిని ఇబ్బంది పెట్టనని, వారి భావోద్వేగాలతో ఆడుకోనని అందుకే తనతో చాలామంది ప్రేమలో పడతారని ఖాన్ చెప్పుకొచ్చాడు. ఖాన్ ను స్థానికులు ప్లే బాయ్ కింగ్ గా పిలుస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ ‘నంది’.. తెలంగాణ ‘సింహ’ అవార్డులేమయ్యాయ్!

Updated On 3 Nov 2022 1:56 PM GMT
subbareddy

subbareddy

Next Story