Rakhi Festival | రాఖీ పండుగ బంధాల‌ను బ‌లోపేతం చేసే పండుగ‌. సోద‌రులు, సోద‌రిణుల మ‌ధ్య అనుబంధాల‌ను పెంచే పండుగ ఇది. అయితే రెండు రోజుల్లో జరుపుకోబోయే రాఖీ పండుగ ఆ మూడు రాశుల వారికి ప్ర‌త్యేక‌మ‌ట‌. 200 ఏండ్ల‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌చ్చే అరుదైన గ్ర‌హ‌స్థితి వ‌ల్ల ఊహించ‌ని ఫ‌లితాలు పొందుతార‌ని పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఈ రాఖి పౌర్ణమి రోజున రవియోగంతో పాటు శతభిషా నక్షత్రంలో బుధయోగం కూడా ఏర్పడబోతోందట. అయితే ఈ గ్ర‌హ‌స్థితి.. […]

Rakhi Festival |

రాఖీ పండుగ బంధాల‌ను బ‌లోపేతం చేసే పండుగ‌. సోద‌రులు, సోద‌రిణుల మ‌ధ్య అనుబంధాల‌ను పెంచే పండుగ ఇది. అయితే రెండు రోజుల్లో జరుపుకోబోయే రాఖీ పండుగ ఆ మూడు రాశుల వారికి ప్ర‌త్యేక‌మ‌ట‌. 200 ఏండ్ల‌కు ఒక‌సారి మాత్ర‌మే వ‌చ్చే అరుదైన గ్ర‌హ‌స్థితి వ‌ల్ల ఊహించ‌ని ఫ‌లితాలు పొందుతార‌ని పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఈ రాఖి పౌర్ణమి రోజున రవియోగంతో పాటు శతభిషా నక్షత్రంలో బుధయోగం కూడా ఏర్పడబోతోందట.

అయితే ఈ గ్ర‌హ‌స్థితి.. ముఖ్యంగా మూడు రాశులపై ప్ర‌భావం చూపుతుంద‌ని పండితులు అంటున్నారు. ఆ మూడు రాశుల వారికి ల‌క్ష్మీ క‌రుణా క‌టాక్షం ఉండ‌బోతుంద‌ని పేర్కొంటున్నారు. ఆ రాశులకు సంబంధించిన వారు.. త‌మ వృత్తి, ఉద్యోగాల్లో పురోగ‌తి సాధిస్తార‌ట‌. త‌మ వ్యాపారాలు కూడా విస్త‌రించి గొప్ప స్థితికి చేరుకోబోతార‌ట‌.

ఈ గ్రహస్థితి వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణం అవుతుందని పండితులు చాలా కచ్చితంగా చెబుతున్నారు. డ‌బ్బులు లేక ఆగిపోయిన ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ట‌. ఇక ఆ మూడు రాశుల వారికి రాఖీ పండుగ త‌ర్వాత మంచి రోజులేన‌ట‌. 200 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గ్రహస్థితి వల్ల యోగించే మూడు రాశులు ఇవే..

మిథున రాశి

చాలా అరుదుగా సంభవించే ఈ గ్రహస్థితి రాఖీ పౌర్ణ‌మి తర్వాత ఏర్పడబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనుభ‌వించిన ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతార‌ట‌. ఇక ఆర్థికంగా స్థిర‌ప‌డుతార‌ట‌. ఆర్థిక సంక్షోభాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాదు డ‌బ్బును కూడా పొదుపు చేస్తార‌ట‌. డబ్బు లేక ఆగిపోయిన అన్ని పనులు ఒక్కొక్కటిగా విజయవంతంగా పూర్తి చేస్తార‌ట‌. మిథున రాశి వారికి రాఖి పౌర్ణమి తర్వాత జీవితంలో గొప్ప మార్పులతో మంచి రోజులు ప్రారంభం అవుతాయని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి

సింహరాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వత మంచి రోజులు ప్రారంభం అవుతాయట‌. ఇప్పటి వరకు మూసుకున్న అన్ని దారులు తెరచుకుని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందట‌. మీరు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయట‌. అంతేకాదు అనారోగ్యాలన్నీ కుదుట పడి ఆరోగ్యవంతులు కూడా అవుతారట‌.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోతుంద‌ట‌. వీరి కేరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకొని, ప్రమోషన్ల తో పాటు రాబడి కూడా పెరుగుతుంద‌ట‌. అంతేకాదు కొత్త సంపాదన మార్గాలు కూడా దొరకుతాయ‌ట‌. మీరు, మీ కుటుంబంతో ఆనందంగా సమయం గడప‌డమే కాకుండా, దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంద‌ట‌.

Updated On 29 Aug 2023 3:14 AM GMT
sahasra

sahasra

Next Story