Antarctica |
విధాత: మంచు ఎడారి అంటార్కిటికాలో(Antarctica) వాతావరణం ఎలా ఉంటుందో చూపించే వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోలిష్ అంటార్కిటిక్ ఎక్స్‌పెడెషన్‌లో భాగంగా అక్కడ ఉంటున్న టామస్ కుర్చాబా అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
వీడియోను చూస్తుంటే.. వేగంగా వెళుతున్న రైలు డోర్ వద్ద వ్యక్తి వేలాడుతున్నట్లు ఉంటుంది. నిజానికి అందులో ఉన్న వ్యక్తి అంటార్కిటికాలోని తన క్యాంప్ డోర్ వద్ద నుంచి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు.
అయితే బయట వీస్తున్న భీకరమైన గాలుల ధాటికి అతడు రాలేకపోతాడు. లోపల ఉండే సహచరుడు అతడికి చేయిచ్చి లోపలకి లాగినట్లు వీడియోలో ఉంది. అయితే చాలా మంది ఇతర యూజర్లు అది రైలు ప్రయాణమేమో అని భ్రమపడ్డారు. ఆనక విషయం తెలిసి అలాంటి పరిస్థితుల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ వీడియో షూట్ చేసిన అంటార్కిటికాలోని కింగ్ జార్జ్ ఐలాండ్లో పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతాయి. ఇక్కడ అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, చైనా, పోలండ్, రష్యా, సౌత్‌కొరియా దేశాలకు శాశ్వత క్యాంపులున్నాయి.
View this post on Instagram