Viral Video | విధాత: మాన‌వుడు బ‌తికేందుకు గుండె చాలా ప్ర‌ధానం. గుండె ఆగిపోతే క్ష‌ణాల్లోనే ప్రాణాలు ఆవిరైపోతాయి. మ‌న పిడికిలంతా ప‌రిమాణంలో ఉండే గుండె.. కండ‌ర‌ నిర్మిత‌మైన అవ‌యవం. హృద‌యం ఛాతి మ‌ధ్య భాగంలో కొద్దిగా ఎడ‌మ ప‌క్క‌కు ఉంటుంది. గుండె ద్వారా శ‌రీరానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. గుండెలో మొత్తం నాలుగు గ‌దులు ఉంటాయి. పైన రెండు క‌ర్ణిక‌లు, కింద రెండు జ‌ఠ‌రిక‌లు ఉంటాయి. శరీర భాగాల […]

Viral Video |

విధాత: మాన‌వుడు బ‌తికేందుకు గుండె చాలా ప్ర‌ధానం. గుండె ఆగిపోతే క్ష‌ణాల్లోనే ప్రాణాలు ఆవిరైపోతాయి. మ‌న పిడికిలంతా ప‌రిమాణంలో ఉండే గుండె.. కండ‌ర‌ నిర్మిత‌మైన అవ‌యవం. హృద‌యం ఛాతి మ‌ధ్య భాగంలో కొద్దిగా ఎడ‌మ ప‌క్క‌కు ఉంటుంది. గుండె ద్వారా శ‌రీరానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది.

గుండెలో మొత్తం నాలుగు గ‌దులు ఉంటాయి. పైన రెండు క‌ర్ణిక‌లు, కింద రెండు జ‌ఠ‌రిక‌లు ఉంటాయి. శరీర భాగాల నుంచి చెడు ర‌క్తాన్ని కుడి క‌ర్ణిక‌, జ‌ఠ‌రిక‌ గ్ర‌హించి, ఊపిరితిత్తుల‌కు చేర‌వేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజ‌న్‌తో క‌లిసిన ర‌క్తం తిరిగి పుపుస ధ‌మ‌ని ద్వారా ఎడ‌మ క‌ర్ణిక‌, ఎడ‌మ జ‌ఠ‌రికకు చేరుతుంది. అక్క‌డ్నుంచి మ‌హాధ‌మ‌ని ద్వారా ర‌క్తం తిరిగి శ‌రీర భాగాల్లోకి చేరుతుంది.

సిర‌లు శ‌రీర భాగాల నుంచి చెడు ర‌క్తాన్ని గుండెకు చేర‌వేస్తాయి. గుండె నుంచి ఊపిరితిత్తుల‌కు చెడుర‌క్తాన్ని పుపుస సిర‌లు చేర‌వేస్తాయి. అయితే హృద‌య స్పంద‌న‌లు ల‌బ్ డ‌బ్ రూపంలో మ‌న‌కు వినిపిస్తాయి.

కుడి క‌ర్ణిక ర‌క్తంతో నిండి, కుడి జ‌ఠ‌రిక‌లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు ల‌బ్ అనే శ‌బ్దం వ‌స్తుంది. జ‌ఠ‌రిక‌ల్లోని ర‌క్తం తిరిగి శ‌రీర భాగాల‌కు, ఊపిరితిత్తుల‌కు పంప్ చేసిన‌ప్పుడు డ‌బ్ అనే శ‌బ్దం వ‌స్తుంది. ఈ పీడ‌నాన్ని సిస్టోలిక్, డ‌యాస్టోలిక్‌గా పిలుస్తారు.

Updated On 8 April 2023 11:03 AM GMT
subbareddy

subbareddy

Next Story