US Woman | చేసేది ఆయా పని.. ఒక్క రోజు సంపాదన మాత్రం రూ.1.65 లక్షలు
US Woman | ఆమె కోటీశ్వరురాలు కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కూడా కాదు.. బహుళ అంతస్తులు లేవు.. కార్లు లేవు.. కానీ ఆమె ప్రయివేటు జెట్‌లలో, ఓడల్లో ప్రయాణిస్తున్నది. అంతేకాదు ప్రపంచ దేశాలు తిరుగుతూ.. ఖరీదైన కార్లలో ప్రయాణిస్తున్నది.. నడుపుతున్నది. మరి ఆమె కోటీశ్వరురాలు కాదు.. ఇవన్నీఎలా సాధ్యమవుతున్నాయని మీకు సందేహం కలగొచ్చు. మరి ఆ సాధారణ మహిళ గురించి తెలుసుకోవాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే. ఆ సాధారణ మహిళ అమెరికాకు చెందిన గ్లోరియా రిచర్డ్స్. వయసు 34 […]

US Woman |
ఆమె కోటీశ్వరురాలు కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కూడా కాదు.. బహుళ అంతస్తులు లేవు.. కార్లు లేవు.. కానీ ఆమె ప్రయివేటు జెట్‌లలో, ఓడల్లో ప్రయాణిస్తున్నది. అంతేకాదు ప్రపంచ దేశాలు తిరుగుతూ.. ఖరీదైన కార్లలో ప్రయాణిస్తున్నది.. నడుపుతున్నది. మరి ఆమె కోటీశ్వరురాలు కాదు.. ఇవన్నీఎలా సాధ్యమవుతున్నాయని మీకు సందేహం కలగొచ్చు. మరి ఆ సాధారణ మహిళ గురించి తెలుసుకోవాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే.
ఆ సాధారణ మహిళ అమెరికాకు చెందిన గ్లోరియా రిచర్డ్స్. వయసు 34 ఏండ్లు. బతకడం కోసం ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. కేవలం తనకు వచ్చిన కళను నమ్ముకుంది. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలకు తన మధురమైన గొంతుతో పాటలు పాడి వినిపించడం, చిన్నారులతో ఓపిగ్గా మాట్లాడటం ఆమెకు వచ్చిన విద్య. ఇక ఈ విద్యకు మరింత పదును పెట్టింది రిచర్డ్స్. కార్లను కూడా డ్రైవ్ చేయడం ఆమెకు వచ్చు. ఇంకేముంది.. పిల్లలకు సమయం ఇవ్వలేని కోటీశ్వరుల ఇండ్లలో గ్లోరియా రిచర్డ్స్ ఆయాగా పని చేయడం మొదలుపెట్టింది.
మరి ఆమె దినచర్య ఏంటని మీకు అనుమానం రావొచ్చు. ఏం లేదండి.. పిల్లలను ఆడించడం, పాడించడం, కథలు చెప్పడం, పార్కులకు, హోటల్స్‌కు తీసుకెళ్లడమే. అప్పుడప్పుడు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడమే రిచర్డ్స్ దినచర్య. అంతేకాదు.. కోటీశ్వరుల కార్లలోనే వారి పిల్లలను గ్లోరియా బయటకు తీసుకెళ్తుంది.
పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే ఆమెకు ఒక్క అమెరికాలోనే కాదు.. విదేశాల్లోనూ క్లయింట్స్ ఉన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాల్సినప్పుడు ప్రైవేట్ జెట్‌లు, ఓడల్లో ఆమె ప్రయాణిస్తున్నది. ఆమె రవాణా ఖర్చులను కూడా ఆమెను ఆయాగా నియమించుకునే వాళ్లే భరిస్తారు.
గ్లోరియా రిచర్డ్స్ ను కొందరు ఒక రోజు, ఇంకొందరు వారం రోజులు, మరికొందరు 15 రోజులు.. నెల రోజుల కోసం కూడా నియమించుకుంటారు. ఇలా రోజుకు 2000 డాలర్ల చొప్పున ఆమెకు వేతనం చెలిస్తారు. అంటే ఆమె ఒకరోజు సంపాదన రూ. 1.65 లక్షలు అన్నమాట.
ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ.. సంవత్సరంలో రెండు నెలల పాటు కష్టపడితే మిగతా 10 నెలలు హ్యాపీగా బతికేస్తానని చెప్పింది. పిల్లలను ఆడించడం, పాడించడం అంత సులువేం కాదు.. కానీ తాను మేనేజ్ చేయగలను అని గ్లోరియా పేర్కొంది.
