విధాత: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు తమిళ, మలయాళ సినీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. ఈమె పెరిగింది హైదరాబాదులో అయినా పుట్టింది మాత్రం ఒంగోలులో. ఈమె స్వస్థలం ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు. ఈ 47 ఏళ్ల నటిని చాలా మంది ప్ర‌గ‌తి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఈమె భాగ్య రాజా చిత్రం ద్వారా తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప‌లు తమిళ, మలయాళ చిత్రాలలో […]

విధాత: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు తమిళ, మలయాళ సినీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలు. ఈమె పెరిగింది హైదరాబాదులో అయినా పుట్టింది మాత్రం ఒంగోలులో. ఈమె స్వస్థలం ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు. ఈ 47 ఏళ్ల నటిని చాలా మంది ప్ర‌గ‌తి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఈమె భాగ్య రాజా చిత్రం ద్వారా తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప‌లు తమిళ, మలయాళ చిత్రాలలో హీరోయిన్‌గానే నటించింది.

కానీ ఆ తర్వాత మాత్రం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. ఎక్కువగా సహాయ పాత్రలో నటిస్తోంది. ‘ఏమైంది ఈ వేళ’ సినిమాలో ప్రగతి పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం కూడా అందుకుంది. మొదటగా చెన్నైలో కార్టూన్ పాత్రలకు గాత్ర దానం చేసేది. కాలేజీ రోజుల్లోనే చెన్నైలో మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి వ్యాపార ప్రకటనల్లో కనిపించింది. వివాహం కావడంతో కొంత కాలం విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ మూడు భాషల్లో సినిమాలు, టీవీ సీరియల్‌లలో నటించడం మొదలు పెట్టింది. ఈమె వైవాహిక జీవితం మాత్రం సజావుగా సాగలేదు.

1975లో పుట్టిన ప్రగతి 1997లో అంటే తన 21 వ ఏట వివాహం చేసుకుంది. వివాహం ఆమె ఇష్ట ప్రకారం జరిగినా.. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం అనేది తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమని ఆమె భావిస్తోంది. దీనికి పెద్ద వాళ్ళని, తల్లిదండ్రులను కూడా తప్పు పట్టలేన‌ని, మనకు అంతా తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్, మొండితనమే వాటికి కారణమని ఆమె చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ త‌ప్పుడు నిర్ణయాల వల్ల జరిగే పర్యవసానాల‌ నుంచి కొన్ని సార్లు బయటపడటం కూడా కష్టమే. ప్రస్తుతం సింగిల్ మద‌ర్‌గా ఉన్నాను. భర్తకు విడాకులు ఇచ్చాక కూతురితో ఒంటరిగా ఉంటున్నాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదు.

కానీ నా సుఖ సంతోషాలను… కష్ట నష్టాలను. నా మంచి చెడులను పంచుకునేందుకు ఒక మంచి వ్యక్తి తోడు మాత్రం కావాలనే ఆలోచన ఉంది. కానీ అతనికి మెచ్యూరిటీ ఉండాలి. ఎందుకంటే నేను చాలా విషయాల్లో చాలా మొండిగా ఉంటాను. 20 ఏళ్ల వయసులో అయితే పెళ్లి చేసుకున్న అడ్జస్ట్ అయి బతికే దాన్ని ఏమో! కానీ ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి మరో పెళ్లి చేసుకునే యోచన లేదు అని తెలియజేసింది.

సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలియంది కాదు. తాను చేసే డాన్స్ లు, వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. వాటికి నెటిజెన్ల నుండి ట్రోల్స్ ఎదురవుతుంటాయి.ఈ వయసులో నీకు ఇది అవసరమా… అని వారు కామెంట్ చేస్తూ ఉంటారు.

దాని గురించి ఆమె మాట్లాడుతూ నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోను. నా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తున్నాను. మీ చెత్త కామెంట్స్ నన్ను మార్చలేవు అంటూ వారికి కౌంటర్స్ ఇస్తానని తెలిపింది. 2002లో విడుదలైన బాబీ మూవీతో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది.

Updated On 14 Jan 2023 4:25 AM GMT
krs

krs

Next Story