విధాత‌: 100 మందిలో 7 శాతం శిశువుల్లో పుట్టుక‌తోనే లోపాలు ఉంటాయి. శిశువుల్లో లోపాలను టిఫా స్కానింగ్‌తోనే తెలుసుకోవ‌డం సాధ్యమౌతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. లోపాల‌ను టిఫా స్కానింగ్ ద్వారా ముందుగానే తెలుసుకొని త‌గిన చికిత్స చేసే అవ‌కాశం ఉంటుంది. అందుకే టిఫా స్కానింగ్‌ మిషిన్లను పేట్ల బురుజు ఆస్పత్రి వద్ద మంత్రి వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. […]

విధాత‌: 100 మందిలో 7 శాతం శిశువుల్లో పుట్టుక‌తోనే లోపాలు ఉంటాయి. శిశువుల్లో లోపాలను టిఫా స్కానింగ్‌తోనే తెలుసుకోవ‌డం సాధ్యమౌతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. లోపాల‌ను టిఫా స్కానింగ్ ద్వారా ముందుగానే తెలుసుకొని త‌గిన చికిత్స చేసే అవ‌కాశం ఉంటుంది. అందుకే టిఫా స్కానింగ్‌ మిషిన్లను పేట్ల బురుజు ఆస్పత్రి వద్ద మంత్రి వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్కానింగ్‌ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేట్ల బురుజు ఆస్పత్రిలోనే కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సీఎం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో 99.2 శాతం ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలు జరిగాయని మంత్రి తెలిపారు.

Updated On 26 Nov 2022 11:00 AM GMT
krs

krs

Next Story