జాతీయ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా క్రీడోత్సవాలు విధాత, మెదక్ బ్యూరో: స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని యువకులకు, యువజన సంఘాల వారికి జిల్లా స్థాయిలో క్రీడోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు మెదక్ బోదన్ X రోడ్ వద్ద జరిగిన టూకే రన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వివిధ పోటీలలో ఉత్తమ […]

  • జాతీయ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా క్రీడోత్సవాలు

విధాత, మెదక్ బ్యూరో: స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని యువకులకు, యువజన సంఘాల వారికి జిల్లా స్థాయిలో క్రీడోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు మెదక్ బోదన్ X రోడ్ వద్ద జరిగిన టూకే రన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వివిధ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. జాతీయ యూత్ డేని పురస్కరించుకొని జిల్లా ఎస్ప మాట్లాడుతూ 26వ జాతీయ యూత్ డే యొక్క థీమ్ గా అభివృద్ధి చెందిన యువత అభివృద్ధి చెందిన దేశానికి సమానం అని చెప్ప‌వ‌చ్చు అన్నారు.

వివేకానందుడు గొప్ప విద్యావేత్త మరియు సాహితీవేత్త అని అతని ప్రేరణతో యువత అన్నీ రంగాలలో ముందుండాలని సూచించారు. నేటి యువతే రేపటి భారత భవిత అని అన్నారు. కావున సైబర్ క్రైమ్, స్త్రీలకు మరియు ట్రాఫిక్ రూల్స్ కి మొదలగు వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ముందు పాఠశాలలలో మొదలు పెడుతున్నామని తెలిపారు.

అవగాహన కార్యక్రమాలలో యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి చెడుల పైన అవగాహన ఏర్ప‌డుతుంది. త‌ద్వారా యువత పక్క దారిపట్టకుండా ఉంటారని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించ‌డంతో పాటు తమకి అవగాహన ఉన్న ప్రతి విషయాన్ని తమ ప‌క్కవారికి తెలియజేసి వారిలో అవ‌గాహ‌న క‌ల్పించి దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించాలని కోరారు.

ఆసక్తి గల ఉత్సాహవంతులైన యువకులు, క్రీడాకారులు ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువతకి, అద్బుతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో మెదక్ టౌన్ డి.ఎస్.పి. సైదులు, సి.ఐ. లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

Updated On 12 Jan 2023 4:27 PM GMT
krs

krs

Next Story