విధాత, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో ఎదురవుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మలిదశ ఉద్యమకారులను అణిచివేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ అన్నారు. సోమవారం మాడుగుల పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులతో , విద్యార్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చకిలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి, ఆస్తులు అమ్ముకొని జైలు పాలైన నాయకులను కార్యకర్తలను పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం […]

విధాత, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో ఎదురవుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మలిదశ ఉద్యమకారులను అణిచివేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ అన్నారు. సోమవారం మాడుగుల పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులతో , విద్యార్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చకిలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి, ఆస్తులు అమ్ముకొని జైలు పాలైన నాయకులను కార్యకర్తలను పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం తన వంతుగా పోరాటాలు చేస్తానన్నారు.

ఉద్యమకారుల కోసం చేపట్టే పోరాటానికి మలి దశ ఉద్యమకారులు కలిసి రావడం ఆనందదాయకం అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు స్థానిక ఉద్యమకారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వక పోవడంతో పాటు ఎలాంటి పథకాలు మంజూరు చేయకపోవడంఎంతో ఆవేదన కలుగుతుందన్నారు.

ఉద్యమకారుల సంక్షేమం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పల్లె రంజిత్, నాయకులు మేడి విజయ్, సయ్యద్ ఫెరోస్, శ్యామ్, తిరుపతి, సాయి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated On 31 Jan 2023 4:02 AM GMT
krs

krs

Next Story