Kaikala Satyanarayana | తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రంగంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ(87) క‌న్నుమూశారు. హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని త‌న ఇంట్లోనే శుక్ర‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. కైకాల గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ ప‌డుతూ ఇవాళ ఉద‌యం క‌న్నుమూశారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతిప‌ట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం […]

Kaikala Satyanarayana | తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ రంగంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ(87) క‌న్నుమూశారు. హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లోని త‌న ఇంట్లోనే శుక్ర‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

కైకాల గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ ప‌డుతూ ఇవాళ ఉద‌యం క‌న్నుమూశారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతిప‌ట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

1935, జులై 25న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన స‌త్యనారాయ‌ణ‌.. న‌ట‌న‌పై త‌న‌కున్న అభిమానంతో అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. కైకాల‌లోని ప్ర‌తిభ‌ను గుర్తించిన ప్ర‌ముఖ నిర్మాత డీఎల్ నారాయ‌ణ గుర్తించారు. సిపాయి కూతురు సినిమాలో ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు డీఎల్ నారాయ‌ణ‌.

‘తమ్ముడూ’ అంటూ.. కైకాల తోడబుట్టినవాడిలా ఆదరించారు: చిరంజీవి

పౌరాణికం, జాన‌ప‌దం, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో కైకాల స‌త్యనారాయ‌ణ హీరోగా, విలన్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. నంద‌మూరి తార‌క‌రామ‌రావు, అక్కినేని నాగేశ్వ‌ర్ రావు, కృష్ణ‌, శోభ‌న్‌తో పాటు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ వంటి న‌టులు న‌టించిన ప‌లు సినిమాల్లో కైకాల కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. 770కి పైగా సినిమాల్లో న‌టించారు కైకాల‌. 223 చిత్రాలు 100 రోజుల‌కు పైగా ఆడాయి. ఎన్టీఆర్‌తో క‌లిసి 101 చిత్రాల్లో న‌టించారు.

1960, ఏప్రిల్ 10వ తేదీన నాగేశ్వ‌ర‌మ్మ‌తో కైకాల‌కు వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుళ్లు, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. 1996లో కైకాల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేసి 11వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం (2017)

ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994) నంది అవార్డు

రఘుపతి వెంకయ్య అవార్డు (2011)

ఇతర గౌరవాలు

ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు[7]
నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.

కైకాల నటించిన కొన్ని ముఖ్య సినిమాలు

సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)
లవకుశ (1963)
పాండవ వనవాసం (1965)
పరమానందయ్య శిష్యుల కథ (1966)
ప్రేమనగర్ (1971)
తాతా మనవడు (1973)
నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్
జీవన జ్యోతి (1975)
సిరిసిరిమువ్వ (1976)
సెక్రటరీ (1976)
చక్రధారి (1977)
దాన వీర శూర కర్ణ (1977) - భీముడు
యమగోల (1977) -యముడు
శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య
శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
రుద్రవీణ (1988)
నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య
సూత్రధారులు (1990) - నీలకంఠయ్య
గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్
భైరవ ద్వీపం (1994)
ముద్దుల ప్రియుడు (1994)
యమలీల (1994) - యముడు
ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
సాహసవీరుడు - సాగరకన్య (1996)[6]
సూర్యవంశం (1998)
శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య
సమరసింహారెడ్డి (1999)
మురారి (2001)
అరుంధతి (2009) *నరసింహుడు (2005

Updated On 23 Dec 2022 5:32 AM GMT
subbareddy

subbareddy

Next Story