Tomato గిట్టుబాటుకాని రైతులు.. పశువులకు మేతగా వేసేస్తున్న వైనం విధాత‌: మొన్నటి వరకూ దాదాపు కిలో రెండు వందలు పలికిన టమాటా ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. గత మూడు నెలలూ టమాటా ధర ఆకాశాన్ని అంటింది. కిలో రెండు వందలవరకూ అమ్ముడుపోయింది. దీంతో ఆ మూడు నెలలూ పంట తీసిన రైతులు లక్షాధికారులు అయ్యారు. కొందరు రైతులు ఐతే కోట్లు ఆర్జించారు. టమాటా రసం చేసుకుని తినేవాళ్లు ధన్యులు అనేకాడికి వచ్చింది. ఇక టమోటా లారీ […]

Tomato

  • గిట్టుబాటుకాని రైతులు..
  • పశువులకు మేతగా వేసేస్తున్న వైనం

విధాత‌: మొన్నటి వరకూ దాదాపు కిలో రెండు వందలు పలికిన టమాటా ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. గత మూడు నెలలూ టమాటా ధర ఆకాశాన్ని అంటింది. కిలో రెండు వందలవరకూ అమ్ముడుపోయింది. దీంతో ఆ మూడు నెలలూ పంట తీసిన రైతులు లక్షాధికారులు అయ్యారు. కొందరు రైతులు ఐతే కోట్లు ఆర్జించారు. టమాటా రసం చేసుకుని తినేవాళ్లు ధన్యులు అనేకాడికి వచ్చింది.

ఇక టమోటా లారీ ఎక్కడైనా బోల్తా పడితే అక్కడ పోలీసులను కాపలా పెట్టాల్సిన పరిస్థితి. చివరకు గవర్నమెంట్లు సైతం సబ్సిడీల్లో రైతుబజార్లలో టమోటాలు విక్రయించేరోజులు అవి. టమాటా పప్పు తింటున్నారా.. మీ వైభోగం మాకు ఎక్కడిదమ్మా అంటూ పక్కింటి అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్న రోజులవి.. టమాటా చేనుకు కాపలాగా గార్డులను ఏర్పాటు చేసుకున్న కాలమది.


అవన్నీ గతం… ఇప్పుడు పరిస్థితులు మారాయి. టమాటా మొత్తం రేటు పడిపోయింది. కిలో రిటైల్ మార్కెట్లో తోపుడు బళ్ల మీద కిలో పాతిక రూపాయలకు అమ్ముతుండగా మదనపల్లి, పత్తికొండ వంటి పెద్ద మార్కెట్లో మాత్రం కిలో 4 రూపాయల లోపునకు పడిపోయింది.

దీంతో సరుకు అమ్ముడుపోక, మళ్ళీ ఇళ్లకు తీసుకుపోలేక రైతులు రోడ్లవద్ద పడేస్తున్నారు. కొందరు అయితే ఆవులు, మేకలకు పడేస్తున్నారు. ఖరీఫ్ పంట చేతికి రావడం.. అన్ని చోట్లా వర్షాలు కురుస్తుండడంతో ఉత్పత్తి పెరగడం, అన్నిచోట్ల నుంచీ టమాటా గంపలు మార్కెట్ కు తరలి వస్తుండడంతో రేటు తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు రైతులు దిగాలుగా కూర్చుంటున్నారు.

Updated On 8 Sep 2023 10:55 AM GMT
somu

somu

Next Story